దొంగ చేతికి తాళాలు అంటే ఇదేనేమో !! సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు
కంచే చేను మేయడం.. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం లాంటి సామెతలు వినే ఉంటాం. తాజాగా అచ్చం అలాంటి ఘటననే అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరిగింది. హుండీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరే నగదు చోరీకి పాల్పడిన సంఘటన ఆలయ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. సెక్యూరిటీ అధికారి కృష్ణారెడ్డి హుండీలో డబ్బులు చోరీ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
కంచే చేను మేయడం.. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం లాంటి సామెతలు వినే ఉంటాం. తాజాగా అచ్చం అలాంటి ఘటననే అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరిగింది. హుండీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరే నగదు చోరీకి పాల్పడిన సంఘటన ఆలయ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. సెక్యూరిటీ అధికారి కృష్ణారెడ్డి హుండీలో డబ్బులు చోరీ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. హనుమాన్ దర్శనం కోసం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆంజనేయుడిపై విశ్వాసంతో, నమ్మకంగా భక్తులు హుండీలలో కానుకలు సమర్పిస్తుంటారు. అయితే భక్తులు చెల్లించుకున్న ముడుపులు చోరీ కావడం పట్ల తమ మనోభావాలను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ తో మళ్లీ రేసులోకి సంపూర్ణేశ్ బాబు
Taapsee Pannu: లగ్జరీ కారును కొన్న తాప్సీ.. ధర తెలిస్తే షాక్ !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

