AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Fight Video: అంతా చూస్తుండగా తన్నుకున్న పోలీసులు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..

Bihar Police Fight Video: ఇద్దరు బీహార్ పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కారణంగా.. బీహార్ పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత ప్రాంతమైన నలందలో ఇద్దరు బీహార్ పోలీసులు తన్నుకున్నారు. అంతా చూస్తుండగా వీరు కుస్తీ పట్టడం పెద్ద సంచలనంగా మారింది.

Police Fight Video: అంతా చూస్తుండగా తన్నుకున్న పోలీసులు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
Bihar Police Fight Video
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2023 | 8:43 PM

Share

నలంద, సెప్టెంబర్ 18: బీహార్‌లో ఇద్దరు పోలీసులు రోడ్డున పడ్డారు. వాటాల కోసం తన్నుకున్నారు. అక్కడో ఇక్కడో కాదు జనం మధ్యే తేల్చుకున్నారు. అంతా చూస్తుండగా ఒకరిని మరొకరు కొట్టుకోవడం సంచలనంగా మారింది. జనం నుంచి వసూలు చేసిన డబ్బును పంచుకునే సందర్భంలో తేడా కొట్టింది. దీంతో ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంతలో వారిద్దరినీ ఎవరో మొబైల్ లో వీడియో తీసి వైరల్ చేశారు. మార్గమధ్యంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ తగాదా వీడియో ఎస్పీకి చేరడంతో వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు.

వాస్తవానికి, ఇద్దరూ 112 ఎమర్జెన్సీ సర్వీస్‌లో ఉన్నారు. తగాదాకు సంబంధించి.. పరస్పరం కుమ్మక్కై అక్రమ వసూళ్లకు పాల్పడి.. వచ్చిన డబ్బు పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో మార్గమధ్యలో వారిద్దరూ ఘర్షణ పడ్డారు. వారిద్దరూ తాము పోలీస్ యూనిఫాంలో ఉన్న సంగతిని కూడా పట్టించుకోకుండా కుస్తీ పట్టారు. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎస్పీ వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు. నలందలో 112 ఎమర్జెన్సీ సర్వీస్‌లో డ్యూటీ చేస్తున్న ఈ ఇద్దరు  పోలీసులను ఎస్పీ అశోక్ మిశ్రా చర్య తీసుకున్నారు. ఇద్దరు పోలీసులను లూప్ లైన్‌లోకి పంపించారు. అయితే ఘర్షణకు గల కారణాలపై స్పష్టత రాలేదు. ఓ పెద్ద వాహనం నుంచి అక్రమంగా రికవరీ చేసిన డబ్బు పంపిణీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఇద్దరి పేర్లు స్పష్టంగా లేవు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం