Unique Love Story: ఇదో విచిత్ర ప్రేమ.. 23 ఏళ్ల యువకుడిని ప్రేమించిన 83 ఏళ్ల బామ్మ.. కుటుంబ సభ్యుల మద్దతుతో సహజీవనం..
ప్రేమ ఆస్థి అంతస్తులు, కుల మతాలకు అతీతం అని అంటారు.. అయితే ఇప్పుడు ప్రేమ దేశ సరిహద్దులు దాటేసింది.. అయితే ఇపుడు 83 ఏళ్ల మహిళ 23 ఏళ్ల అబ్బాయితో ప్రేమ లో పడింది. ఈ ప్రేమ కథ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల వ్యక్తి తన క్లాస్‌మేట్ అమ్మమ్మతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గత ఆరు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. కలిసి జీవిస్తున్నారు. ఇటీవల ఈ జంట తమ ప్రేమకథ బహిరంగంగా తెలిపారు.

జపాన్ లో చోటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన ప్రేమకథ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది సోషల్ మీడియాలో ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ 23 ఏళ్ల యువకుడు కోఫు 83 ఏళ్ల ‘అమ్మమ్మ’ ఐకోతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గత ఆరు నెలలుగా సంబంధంలో ఉన్నారు. ఇటీవల వారు ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమని బహిరంగంగా ప్రకటించారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం కోఫు తన క్లాస్‌మేట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఐకోను కలిశాడు. ఐకో అతని క్లాస్‌మేట్ అమ్మమ్మ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరి మధ్య 60 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉండడంతో .. ఇద్దరూ తమ భావాలను వ్యక్తపరచలేదు.
మొదట ప్రేమను ఎవరు చెప్పారంటే అయితే ఈ ప్రత్యేకమైన ప్రేమకథలో ఒక మలుపు తిరిగింది. ఐకో మనవరాలు డిస్నీల్యాండ్‌కు వెళ్లాలనే తన ప్రణాళికను అకస్మాత్తుగా రద్దు చేసుకుంది. ఫలితంగా కోఫు , ఐకోలు డిస్నీల్యాండ్‌కు చేరుకున్నారు. సిండ్రెల్లా కోట ముందు కోఫు తన మనసులోని మాటను బయటపెట్టి ఐకోకు ప్రపోజ్ చేశాడు.
ఆ జంట రాత్రికి రాత్రే ఫేమస్ ఈ ప్రత్యేకమైన జంట ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ సంబంధం గురించి బహిరంగంగా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ కొద్దిసేపటిలోనే వైరల్ అయింది. ఈ జంట రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. ఐకో ముఖం చూడటంతో తన రోజు ముగుస్తుందని ముద్దుగా కోఫు చెబుతున్నాడు.. తన కొత్త భాగస్వామి కోఫు కోసం వంట చేయడాన్ని తాను ఇష్టపడతానని ఆమె చెబుతుంది. కోఫు రాత్రి నిద్ర పోయే ముందు పళ్ళు తోముకుంటాడని ఆమె నవ్వుతూ చెబుతుంది.
కుటుంబ మద్దతు అయితే కోఫు కుటుంబానికి కూడా ఈ సంబంధానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలియడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ జంటకు వారి రెండు కుటుంబాల పూర్తి మద్దతు ఉంది. ఐకో రెండుసార్లు వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె . ఐదుగురు మనవరాళ్ళు ఉన్నారు. మరోవైపు కోఫు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్నాడు. ఒక సృజనాత్మక సంస్థలో ఇంటర్న్ గా చేస్తున్నాడు.
అయితే ఈ వింత ప్రేమకథ నెటిజన్లను విడదీసింది. కొంతమంది నెటిజన్లు దీనిని నిజమైన ప్రేమకు ఉదాహరణగా పిలుస్తుండగా.. మరికొందరు ఇంత పెద్ద వయస్సు అంతరం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




