PM Modi: రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్.. ఏమన్నారంటే.?
SCO టియాంజిన్ సమావేశంలో ప్రధాని మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా మాట్లాడారు. పుతిన్, షీ జిన్‌పింగ్‌తో భేటీ, భారత్–చైనా సంబంధాలపై చర్చలు కీలకంగా నిలిచాయి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూసేయండి మరి. ప్రధాని మోదీ ఏం మాట్లాడారంటే.. ఓ సారి లుక్కేయండి.
SCO సదస్సులో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న వివాదంపై తాము నిరంతరం చర్చిస్తున్నామన్నారు. ఇటీవలి ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలన్నింటినీ స్వాగతిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నట్టు మోదీ అన్నారు. వీలైనంత త్వరగా యుద్దాన్ని ముగించి శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ఒక మార్గాన్ని కనుగొనాలన్నారు మోదీ.
అటు ఈ సదస్సులో ప్రధాని మోదీ ఉగ్రవాదంపై ఘాటైన సందేశం ఇచ్చారు. చైనా నేలపై, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే, ఆయన ప్రత్యక్షంగా పేరు పెట్టకపోయినా పొరుగు దేశాన్ని బలంగా తప్పుపట్టారు. ఉగ్రవాదం మొత్తం మానవజాతికి అతిపెద్ద సవాలు అని గుర్తు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం భారత్‌తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌గా మారిందని మోదీ స్పష్టం చేశారు. SCO సదస్సు వేదికలో పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు. సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్ దేశాలు భారత్ వైపు నిలుస్తాయా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

