Russia-Ukraine War: జపోరిజియాపై దూసుకెళ్లిన రష్యా రాకెట్లు.. ఇండ్లు, దుకాణాలు ధ్వంసం.. పలువురు మృత్యువాత
అద్దాలు, శిథిలాలు కుప్పలుగా పడి ఉన్నాయి. సమీపంలోని దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడికి సమీపంలోని యూరప్‌లోనే అతి పెద్దదైన అణు కార్మాగారం ఉంది.
ఉక్రెయిన్ నాలుగు భూభాగాలను విలీనం చేసుకున్న తర్వాత కూడా రష్యా దాడుల తీవ్రత తగ్గలేదు. ఉక్రెయిన్‌లోని దక్షిణ నగరం జపోరిజ్జియాపై రష్యా రాకెట్లతో వరుస దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు గట్టి పట్టున్న జపోరిజియాలోని నివాసాలపై రాకెట్లతో మాస్కో భీకర దాడులకు పాల్పడింది. ఈ ధాటికి ఐదుగురు మరణించినట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. మరో 12 మంది గాయపడినట్టుగా చెప్పారు. రాకెట్లు తెల్లవారుజామున నివాస భవనాలను తాకాయి. ఆపై చాలా గంటల తర్వాత మళ్లీ వరుస దాడులు మొదలయ్యాయని చెప్పారు. అద్దాలు, శిథిలాలు కుప్పలుగా పడి ఉన్నాయి. సమీపంలోని దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడికి సమీపంలోని యూరప్‌లోనే అతి పెద్దదైన అణు కార్మాగారం ఉంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
దొనెట్క్స్, ఖేర్సన్, నిప్రో ప్రాంతాల్లోనూ మాస్కో బలగాలు దాడులకు పాల్పడ్డాయని.. ఈ ఘటనల్లో పది మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ డిప్యూటీ చీఫ్ కైరి తిమోషెంకో వెల్లడించారు. సమీపంలో నివసించే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ పిల్లలు భయపడిపోతున్నారని, ఇండ్లు ధ్వంసం కావటంతో..ప్రాణభయంతో అందరం ఏదో ఒక మూలన దాక్కుంటున్నామని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, మరోవైపు.. అణ్వస్త్రాలను వినియోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. అణు దాడి జరుగుతుందని చెప్పడం కష్టమే. రష్యాలో అన్నింటిపైనా పుతిన్‌కు సరైన నియంత్రణ లేదు. అణు దాడికి పాల్పడితే ఆయన మనుగడ సాగించలేరు. ప్రపంచ దేశాలు ఏ మాత్రం క్షమించవని పుతిన్‌కు బాగా తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ఉక్రేనియన్ ఆధీనంలో ఉన్న నగరం పేరుగల జపోరిజ్జియా ప్రాంతానికి రాజధాని, ఈ వారం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు ఇతర ఉక్రేనియన్ ప్రాంతాలతో పాటు – తూర్పున డోనెట్స్క్,లుహాన్స్క్ దక్షిణాన ఖెర్సన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ దాని పాశ్చాత్య మిత్రదేశాలు ఈ చర్యను ఖండించాయి.
మాస్కో నాలుగు ప్రాంతాలలో దేనినీ పూర్తిగా నియంత్రించదు. ఇటీవలి వారాల్లో ఉక్రేనియన్ దళాలు దేశం ఈశాన్య మరియు దక్షిణ ప్రాంతాలలో గణనీయమైన పురోగతిని సాధించాయి. రష్యా ఇప్పుడు జపోరిజిజియా ప్రాంతంలోని మాస్కో ఆక్రమిత భాగంలో ఉన్న యూరప్‌లో అతిపెద్దదైన జపోరిజ్జియా అణు కర్మాగారం యొక్క ఆపరేషన్‌ను చేజిక్కించుకుంటున్నట్లు తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం