Telugu News Trending Dog Dances With The Bride On Her Wedding Day, Internet Loves The Sweet Moment Telugu News
Watch Video: పెళ్లి రోజున పెంపుడు కుక్కతో కలిసి డ్యాన్స్ చేసిన వధువు.. సూపర్ వీడియో.. పూర్తిగా చూడండి
నవ వధువు, పెంపుడు కుక్క వారిద్దరూ ఒకరితో ఒకరు కలిసి చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మధురమైన వీడియోని క్షణం కూడా మిస్ అవ్వకుండా చూడండి.. చాలా బాగుంది!
వైరల్ వీడియో: కుక్కలు మనిషికి అద్భుతమైన సహచరులు. కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలిసిందే. ప్రేమ, దయతో కూడుకున్నవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యజమాని చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటాయి. అందుకే కుక్కలను విశ్వాసానికి మారుపేరు అంటారు. అలాంటి పెంపుడు కుక్కకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. ఎక్కువ వ్యూస్‌తో నెట్టింట దూసుకుపోతుంది..పెళ్లి రోజున వధువుతో కలిసి పెంపుడు కుక్క డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడున్నవారంతా చప్పట్లు, విజిల్స్‌తో హోరెత్తించారు. ఎంతో ఉత్సాహంగా ఉన్న కుక్క వేదికపైకి దూకి వధువు వైపు ప్రేమగా మొరిగింది. కుక్క తన యజమానితో కలిసి కొన్ని రకరకాల స్టెప్స్ వేస్తూ, భిన్నమైన విన్యాసాలు కూడా చేస్తుంది. నవ వధువు, పెంపుడు కుక్క వారిద్దరూ ఒకరితో ఒకరు కలిసి చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మధురమైన వీడియోని క్షణం కూడా మిస్ అవ్వకుండా చూడండి.. చాలా బాగుంది! ట్విట్టర్ యూజర్ @Animalesybichos చిన్న క్లిప్‌ను షేర్ చేశారు. ఇది ఆన్‌లైన్‌లో భాగా వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకు ఈ వీడియోని 2 మిలియన్లకు పైగా వీక్షించారు. 11,000 కంటే ఎక్కువ రీట్వీట్‌లను పొందింది.
చాలా మంది వీరి మధ్య అనుబంధాన్ని బాగా ఇష్టపడ్డారు. మరికొందరు కుక్కలు పెళ్లిలో చిన్న పిల్లలలాంటివని చెప్పారు. మరికొందరు కుక్క అమాయక ప్రేమకు మానవులు అర్హులు కాదని అన్నారు. ఒక వినియోగదారు సరదాగా ఇలా వ్రాశారు, “నా కంటే కుక్క బాగా డ్యాన్స్ చేస్తుంది.” మరొకరు, “అద్భుతం” అని వ్యాఖ్యానించగా, మరొకు అత్యుత్తమ డ్యాన్స్ పార్ట్‌నర్ అని రాశాడు. “అందమైన. మీ ముగ్గురికీ అభినందనలు” అంటూ మరికొందరు కామెంట్ చేశారు.