Kakinada: వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయనివారికి అన్నీ ఆపేస్తామని ఓ ఎమ్మెల్యే హెచ్చరిక.. నెట్టింట్లో వీడియో వైరల్
ఇపుడు ఓ ప్రజాప్రతినిధి.. నెక్స్ట్ ఎన్నికల సమయంలో ఓటు వెయ్యక పోతే అన్ని ఆపేస్తాం అంటూ బహిరంగంగా హెచ్చరించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజల కొరకు.. ప్రజల చేత ఎన్నుకోబడతారన్న సంగతి తెలిసిందే.. ఇందుకోసం ప్రజలకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది రాజ్యాంగం.. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఓటు విలువ కూడా మారిపోతోంది. తమకు నచ్చిన మెచ్చిన నాయకుడు బదులు.. తమకు సంక్షేమ పథకాలను, ఉచిత పథకాలను అందించేవారిని ఎక్కువగా ఎన్నుకునే సంప్రదాయం మొదలయింది. అయితే ఇపుడు ఓ ప్రజాప్రతినిధి.. నెక్స్ట్ ఎన్నికల సమయంలో ఓటు వెయ్యక పోతే అన్ని ఆపేస్తాం అంటూ బహిరంగంగా హెచ్చరించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని ప్రత్తిపాడు నియోజవర్గంలోని జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇటువంటి హెచ్చరికలు జరీ చేశారు. శంఖవరం మండలం అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వచ్చే ఎన్నికలకి వైసీపీకి ఓటు వేయకపోతే మీకు వచ్చే లబ్ధిలన్నీ ఆపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే పెన్షన్లు ఆగిపోతాయని మహిళలు కి ఎమ్మెల్యే పర్వతనేని పూర్ణ చంద్ర ప్రసాద్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..