Cough Syrup: దగ్గుమందు కంపెనీపై WHO హెచ్చరిక నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన భారత ప్రభుత్వం.. పూర్తి డీటైల్స్ మీ కోసం
ఈ కంపెనీ తయారు చేసిన మందులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని పేర్కొంది. అయినప్పటికీ.. ఈ సిరప్ కొన్ని నమూనాలను పరీక్ష కోసం పంపారు. ఇప్పటివరకు దగ్గు సిరప్‌కి సంబంధించిన వివాదం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేయడంతో హర్యానాకు చెందిన దగ్గు సిరప్ తయారీ కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన సిరప్ పై భారత్ లో ఆందోళనను పెంచింది. అయితే.. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ( AIOCD ) దేశంలో ఈ సిరప్ సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన మందులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని పేర్కొంది. అయినప్పటికీ.. ఈ సిరప్ కొన్ని నమూనాలను పరీక్ష కోసం పంపారు. ఇప్పటివరకు దగ్గు సిరప్‌కి సంబంధించిన వివాదం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
- పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో, భారతీయ కంపెనీ తయారు చేసిన సిరప్‌ను తీసుకున్న 60 మందికి పైగా పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అప్రమత్తమైన గాంబియా ప్రభుత్వం ఈ సిరప్‌ను ఉపయోగించవద్దంటూ ఇంటింటికి ప్రచారాన్ని ప్రారంభించింది. సిరప్‌లో గణనీయమైన స్థాయిలో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, ఇది పిల్లల కిడ్నీలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని, దాని ఫలితంగా 66 మంది పిల్లలు మరణించారని గాంబియా ఆరోగ్య విభాగం తెలిపింది.
- పిల్లలు అనారోగ్యంతో మరణించిన తర్వాత వారు తీసుకున్న మందులను గాంబియా ఆరోగ్య శాఖ పరిశోధించింది. ఆరోగ్య శాఖ 23 శాంపిల్స్‌ను పరిశీలించగా, నాలుగు శాంపిల్స్‌లో తగినంత పరిమాణంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే, గాంబియా ఆరోగ్య శాఖ వాదనలను భారత ప్రభుత్వం ధృవీకరించలేదు. నివేదిక కోసం వేచి ఉంది.
- ఇదిలా ఉండగా..ఈ సిరప్‌పై తయారీ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం హర్యానాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ దర్యాప్తు చేస్తోంది. సోనేపట్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్‌లను పరీక్షకు పంపినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ దగ్గు సిరప్‌లను కోల్‌కతాలోని సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక తర్వాతే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తన విచారణను ప్రారంభించింది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ సిరప్ గురించి హెచ్చరిక జారీ చేశారు. మృతులు ఈ నాలుగు మందులు సేవించారని, దీని కారణంగా వారు అనారోగ్యానికి గురయ్యారని హెచ్చరించారు. ఈ నాలుగు మందులు భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన దగ్గు సిరప్‌లు అని WHO తెలిపింది.
- అయితే WHO ఒక ప్రకటన విడుదల చేసింది. కలుషితమైన ఉత్పత్తులు ఇప్పటివరకు గాంబియాలో మాత్రమే కనుగొనబడ్డాయి. కనుక ఈ కంపెనీ ఉత్పత్తులను ఇతర దేశాలకు పంపిణీ చేయవచ్చు. అయితే WHO కు చెందిన సంస్థ డ్రగ్ రెగ్యులేటర్‌తో కలిసి భారతదేశానికి చెందిన డ్రగ్‌పై దర్యాప్తు చేస్తోంది.
- ఈ దగ్గు సిరప్ దేశంలో కూడా సరఫరా చేయబడుతుందేమో అని భయపడ్డారు. అయితే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) అసోసియేషన్ దీనిని ఖండించింది. ఈ కంపెనీకి చెందిన దగ్గు సిరప్‌ను దేశీయంగా సరఫరా చేసేందుకు అనుమతి లేదని. కేవలం ఎగుమతి చేస్తున్నామని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైనా మార్గదర్శకాలను జారీ చేస్తే, దానిని అనుసరిస్తామని అసోసియేషన్ తెలిపింది.
- సెప్టెంబర్ 2022లో గాంబియాలో ఫ్లాగ్ చేయబడిన నాలుగు నాసిరకం ఉత్పత్తుల కోసం WHO మెడికల్ ప్రోడక్ట్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ విషయాన్ని గాంబియా ప్రభుత్వం తర్వాత WHOకి తెలియజేసింది. ఈ నాలుగు ఉత్పత్తులను ఓ ప్రముఖ భారతీయ కంపెనీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసింది.
- అధికారిక మూలాల ప్రకారం, UN ఆరోగ్య సంస్థ ఇంకా ఉత్పత్తి లేబుల్‌లు, ఇతర సమాచారాన్ని భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)తో పంచుకోలేదు. తద్వారా అవి ఎక్కడ తయారు చేయబడిందో ఖచ్చితంగా చెప్పలేం.
- అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, CDSCO హర్యానాలోని అధికారులు తన స్థాయిలో విచారణను కూడా ప్రారంభించారు. ఆరోపణలు నిజమని రుజువైతే.. కంపెనీపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ లైసెన్స్ పొందిన .. ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఆ మందులను తయారు చేసిందని సిడిఎస్‌సిఓ వర్గాలు తెలిపాయి. కంపెనీకి దాని తయారీ లైసెన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే, ఈ కప్ సిరప్ గాంబియాకు మాత్రమే ఎగుమతి చేయబడింది. దేశంలో సరఫరా చేయడానికి అనుమతించబడదు.
- అధికారిక మూలం ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ విషయంలో గాంబియాకు సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేసింది. వాస్తవానికి ఔషధాలను దిగుమతి చేసుకునే దేశాలు వాటి వినియోగాన్ని ఆమోదించే ముందు ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేస్తాయి.
- పిల్లల మరణం తర్వాత, గాంబియా ఆరోగ్య విభాగం అటువంటి 23 నమూనాలను పరీక్షించగా, వాటిలో నాలుగు ఆరోగ్యానికి హానికరమైన డైథలిన్ గ్లైకాల్ , ఇథిలీన్ గ్లైకాల్ యొక్క జాడలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..