- Telugu News Photo Gallery Ratan Tata birth anniversary: A Visionary Leader biggest achievements in his remarkable career
Ratan Tata: మీరు లేరు.. మీ స్మృతులు మా మదిలో పదిలం.. నిత్య కృషీవలుడు రతన్ టాటా జయంతి నేడు..
మరనించీ చిరంజీవులుగా ప్రజల మదిలో కొలువై ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు రతన్ టాటా. దేశానికి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే నేను ఉన్నాను అంటూ ముందుగా వచ్చే వ్యక్తుల్లో రతన్ టాటా మొదటి వరసలో ఉంటారు. ప్రపంచంలో ఎందరో ధనవంతులున్నారు. అయితే రతన్ టాటా మనసున్న మానవత్వం ఉన్న ఐశ్వర్య వంతుడు.. కష్టపడితే కొందరు ధనవంతులు అవ్వొచ్చు ఏమో.. కానీ ప్రతి ఒక్కరూ రతన్ టాటా లాగా ఐశ్వర్యవంతుడు అవ్వొచ్చు. అవును ఎందరో మహాను భావులు.. అందులో రతన్ టాటా లెజెండ్.. నేడు రతన్ టాటా జయంతి..
Updated on: Dec 28, 2024 | 11:12 AM

మనం ఇన్స్పిరేషన్ కి, మోటివేషన్ కి ఎక్కడెక్కడో వెతుకుతాం.. అయితే మనం సరిగ్గా చూస్తే మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో విలువలు పాటించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి విలువలున్న వ్యక్తుల్లో రతన్ టాటా మేలిమి వజ్రం. ఇలాంటి అత్యున్నత మైన విలువలు కలిగిన వ్యక్తీ కోసం ఎంత వెదికినా ప్రపంచ వ్యాపార రంగంలో మరొకరు కనిపించరు. అందుకనే ఆయన మానవీయ వ్యక్తుల్లో మహనీయులు.

Ratan Tata

ఏ విజనరీ లీడర్: రతన్ నావల్ టాటా డిసెంబర్ 28, 1937న బొంబాయిలో జన్మించారు. ఆయన నాయకత్వానికి, సమగ్రతకు పర్యాయపదంగా మారారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌గా, సామాజిక బాధ్యత, నైతిక అభ్యాసాల వంటి విలువలకు కట్టుబడి ఉంటూనే రతన్ టాటా.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మార్చారు. రతన్ టాటా తన తల్లితండ్రులు విడిపోయిన తర్వాత గ్రానీ దగ్గర పెరిగారు. అప్పుడే రతన్ టాటా జీవిత ప్రయాణం సంకల్పం, ప్రేరణతో మొదలైంది.

టాటా గ్రూప్‌లో తొలి అడుగులు కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించారు. రతన్ టాటా కెరీర్ కు ప్రారంభ సంవత్సరాలు.. భవిష్యత్ నాయకత్వ పాత్రలకు పునాది వేసిన ఒక అభ్యాస మైదానంగా నిలిచాయి.

Ratan Tata

టాటా గ్రూప్ చైర్మన్: 1991లో JRD టాటా తర్వాత రతన్ టాటా టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రతన్ టాటా తన పదవీకాలం టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008)ల కొనుగోళ్లతో సహా సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశారు. ప్రపంచ వేదికపై టాటా గ్రూప్ ఉనికిని సుస్థిరం చేశాయి ఈ కొనుగోళ్ళ నిర్ణయాలు.

దేశీయ పరిశ్రమలను పరిగెత్తించిన..: రతన్ టాటా 1998లో టాటా ఇండికాను విడుదల చేసి.. తద్వారా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇది దేశీయంగా మొట్టమొదటి స్వదేశీ కారు. 2008లో సామాన్యులకు అందుబాటు ధరలో టాటా నానో కారుని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. రతన్ టాటా సామాన్యుల కలలను , కోర్కెలను దృష్టిలో ఉంచుకుని వాటిని తీర్చే విధంగా నాణ్యమైన వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

అవార్డులు, పదవీ విరమణ: వ్యాపార వేత్త మాత్రమే కాదు మనత్వం ఉన్న మనిషి.. దేశ భక్తీ నరనరాన్న జీర్ణించుకున్న రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువ.. దేశం కష్టంలో ఉంటె.. తన సంపదను అంతా దేశానికి ధరపోసేందుకు కూడా వెనుకాడని వ్యక్తిత్వం ఆయన సొంతం . రతన్ టాటా 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. ఎన్నో ఆవిష్కరణ, సమగ్రత వారసత్వాన్ని నేటి మిగిల్చిన నిత్య కృషీవలుడు ఐన రతన్ టాటా అక్టోబర్ 9వ తేదీ 2024న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.





























