AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించని ముగ్గురు ప్రధానమంత్రులు ఎవరో తెలుసా?

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ దేశం అంతిమ వీడ్కోలు పలికింది. అయితే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్థలం కేటాయింపుల్లో కేంద్ర చొరవ చూపడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో కేంద్రం మన్మోహన్ మెమోరియల్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంతకు ముందు కూడా ముగ్గురు ప్రధానుల అంత్యక్రియలు ఢిల్లీలో జరగలేదు. వీరిలో పీవీ నరసింహారావు, వీపీ సింగ్, మొరార్జీ దేశాయ్ పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఇప్పటికీ వివాదాల్లో చిక్కుకుంది.

ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించని ముగ్గురు ప్రధానమంత్రులు ఎవరో తెలుసా?
Vp Singh, Morarji Desai, Pv Narasimha Rao
Balaraju Goud
|

Updated on: Dec 28, 2024 | 1:04 PM

Share

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ దేశం అంతిమ వీడ్కోలు పలుకుతున్న సందర్భం ఇది. యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనీ, మౌనముని అని ముద్రపడిన మన్మోహన్‌ చేసిన సేవలను ఆసేతుహిమాచలం గుర్తుచేసుకుంటోంది. వినమ్రత ఉండటమేకాకుండా, వివాదాలకు దూరంగా ఉండటం మన్మోహన్‌ ప్రత్యేకత. ఈ విలక్షణ వ్యక్తిత్వమే ఆయనను శిఖరాలకు చేర్చింది. అయితే, ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక పన్యాసాలకు సంబంధించి రాజకీయాలు వేడెక్కాయి. మన్మోహన్‌ అంత్యక్రియల్లో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని కాంగ్రెస్‌ చెబుతోంది. మన్మోహన్ అంత్యక్రియలకు, స్మారకం ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో మన్మోహన్‌ మెమోరియల్‌ ఏర్పాటు చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్‌ నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, దేశ రాజకీయాల్లో ఓ ప్రధానమంత్రి అంత్యక్రియలు ముఖ్యాంశాలు కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ముగ్గురు ప్రధానమంత్రులు ఉన్నారు. వారి అంత్యక్రియలు ఢిల్లీ వెలుపల జరిగాయి. వీరిలో ఇద్దరికి స్మారకం నిర్మించేందుకు స్థలం కూడా ఇవ్వలేదు. అగ్రస్థానంలో అపర పీవీ నరసింహారావు 1991 నుండి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేసిన తెలంగాణ బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు డిసెంబర్ 2004లో మరణించారు. ఆ సమయంలో ఢిల్లీలో మన్మోహన్ సింగ్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నరసింహారావు కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అయితే కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న సీనియర్ నాయకులు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో కాకుండా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి