Water for Cholesterol: నీళ్లు తాగితే నిజంగానే కొవ్వు కరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే!
తిండి లేకపోయినా బ్రతకచ్చు కానీ.. నీరు లేకపోతే మాత్రం బ్రతకలేం. నీరు శరీరానికి చాలా ముఖ్యం. నీటిని సరిగ్గా తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మంచి నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలో కొవ్వు కూడా పేరుకు పోకుండా ఉంటుంది..
అధిక బరువు తగ్గాలన్నా, ఊబకాయం తగ్గాలంటే, శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పోవాలన్నా, కొవ్వు కరగాలన్నా వాటర్ ఫాస్టింగ్ చేయాలని అంటారు. మరి నిజంగానే మంచి నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ పోతాయా? మంచి నీళ్లతో ఈ సమస్యల నుంచి బయట పడొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉండే ఉంటుంది. సాధారణంగా కొవ్వు రెండు రకాలు ఉంటుంది. మంచి కొవ్వు.. చెడు కొవ్వు.. మంచి కొవ్వు ఆరోగ్యాన్ని పెంచితే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే డయాబెటీస్, గుండె సమస్యలు, అధిక బరువుతో ఇబ్బంది పడటం ఖాయం. అదే సమయంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. అందుకే ప్రతి రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరు సరిగ్గా తాగకపోతే దాని ప్రభావం కొలెస్ట్రాల్‌పై ఎఫెక్ట్ పడుతుంది. మరి నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు ఎలా కరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
మలినాలు పోతాయి:
నీటిని ఎక్కువగా తాగడం వల్ల సిరల్లో పేరుకు పోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. లివర్, మూత్ర పిండాలు అన్నీ క్లియర్ అవుతాయి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీర భాగాలు ఆరోగ్యంగా పని చేస్తాయి. వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉండిపోతే.. యూరిక్ యాసిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు రావచ్చు.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది:
నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిపోతుంది. రక్తంలో, సిరల్లో, శరీర భాగాల్లో పేరుకు పోయిన కొవ్వు బయటకు వెళ్తుంది. అందుకే బరువు తగ్గాలన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగాలన్నా వాటర్ ఫాస్టింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సాధారణ నీటి కంటే గోరు వెచ్చని నీరు తాగితే.. శరీరంలో పేరుకు పోయిన కొవ్వు మరింత ఫాస్ట్‌గా కరుగుతుంది.
డీహైడ్రేషన్ ఉండదు:
నీటిని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. డీహైడ్రేషన్ కారణంగా కాలేయం, మూత్ర పిండాల్లో, రక్తంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకు పోతుంది. అందుకే నీరు చాలా ముఖ్యం.
బాడీ డీటాక్స్ అవుతుంది:
నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. లివర్, కిడ్నీల్లో ఉండే మురికి, మలినాలు బయటకు వెళ్తాయి. వ్యర్థాల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తాగితే బాడీ కూడా డీటాక్స్ అవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.