AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి..

ఏ సీజన్ అయినా సరే, తీపి వంటకాలు, మసాల కూరలు, బిర్యానీల్లో యాలకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ యాలకులు ఆహారానికి మంచి సువాసన, రుచిని అందిస్తాయి. అంతేకాదు..యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, వేసవిలో యాలకులు తినడం మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి..
cardamom
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2025 | 9:21 PM

Share

ఏ సీజన్ అయినా సరే, తీపి వంటకాలు, మసాల కూరలు, బిర్యానీల్లో యాలకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ యాలకులు ఆహారానికి మంచి సువాసన, రుచిని అందిస్తాయి. అంతేకాదు..యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, వేసవిలో యాలకులు తినడం మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో యాలకులు కూడా చాలా మేలు చేస్తాయని అంటున్నారు. వేసవికాలంలో యాలకులను తినడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ఒంట్లో ఉన్న వేడి తగ్గి హెల్తీగా ఉండొచ్చు అంటున్నారు. బాడీ టెంపరేచర్ మైంటైన్ చేసుకోవచ్చు.డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. యాలకులు మంచి డీటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా మాదిరి పని చేస్తాయి. ఒంట్లో ఉన్న విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. యాలకులు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు ఉండవు. హెల్తీగా ఉండొచ్చు.

యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లోని చెడు బ్యాక్టీరియాను తొలగించి దుర్వాసన పోగొడతాయి. దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యల్ని నయం చేస్తాయి. స్కిన్ ఇరిటేషన్ వంటి ఇబ్బందులు ఉండవు. చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. యాలకుల్లో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. యాలకులు ఒత్తిడిని తగ్గిస్తాయి. యాలకులు నమిలితే ప్రశాంతంగా కూడా ఉండొచ్చు ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు