Navaratri 2022: ఉత్సవాల్లో బూర వాయిస్తూ హల్‌చల్‌ చేసిన పోకిరీలకు ఖాకీల గుణపాఠం.. గువ్వలు గుయ్యిమనిపించారు

పెద్ద శబ్ధంతో బూర ఊదుతూ గోల గోల చేసిన కొందరు యువకులకు పోలీసులు గట్టి గుణపాఠం నేర్పారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు గుంపులోనూ, రోడ్డు మీద కూడా బూర ఊదలంటేనే భయపడిపోవాల్సిందే. పోలీసులు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో అలాంటి వారు..

Navaratri 2022: ఉత్సవాల్లో బూర వాయిస్తూ హల్‌చల్‌ చేసిన పోకిరీలకు ఖాకీల గుణపాఠం.. గువ్వలు గుయ్యిమనిపించారు
Jabalpur Police
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2022 | 8:11 AM

నవరాత్రి, దసరా రోజుల్లో బూర ఊదుతూ ఆడుకునే వారిని మీరు కూడా చూసే ఉంటారు. రోడ్డుపైన, ఇంటి చుట్టుపక్కల యువకులు, పిల్లలు బూర ఊదుతూ ఆడుతూ ఎంతో సందడి చేస్తారు. దసరా రోజున మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో అలాంటిదే జరిగింది. జీవితంలో మరిచిపోలేని పెద్ద శబ్ధంతో బూర ఊదుతూ గోల గోల చేసిన కొందరు యువకులకు పోలీసులు గట్టి గుణపాఠం నేర్పారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు గుంపులోనూ, రోడ్డు మీద కూడా బూర ఊదలంటేనే భయపడిపోవాల్సిందే. పోలీసులు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో అలాంటి వారు ఇక రోడ్ల వెంట కూడా కనిపించరు మరీ. ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…

దసరా నాడు జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న కొందరు యువకులు పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ.. బూర ఊదుతూ, రోడ్డుపై ఆడుతూ వెళ్తున్నారు. వారు చేస్తున్న శబ్ధాలకు స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అది చూసిన పోలీసులు వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఓ ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించారు. పెద్ద స్వరంతో బూర వాయించిన వారిని పోలీసులు అడ్డుకుని ఒకరి చెవుల్లో మరొకరు పుంగి వాయించారు. అంతే కాకుండా మార్గమధ్యంలో చెవులు పట్టుకుని బూర వాయిస్తూ, ఆడుతున్న యువకులను పోలీసులు రోడ్డుపై కూర్చోబెట్టారు. అది చూసి రోడ్డు మీద వెళ్తున్న జనం నవ్వడం మొదలుపెట్టారు.

పోలీసులు బూర వాయించేవారిని ఒకరి చెవుల్లో ఒకరు పుంగీ వాయించుకోవాలని చెప్పటంతో.. అప్పుడు వారికి అర్థమైంది. ఆ  శబ్ధాలకు తోటి ప్రజలు ఎంత అసౌకర్యానికి గురయ్యారో..కూడా వారికి అర్థం అవుతుందని ఇలా చేశారు. చెవిలో పుంగి వాయించని వారి చెవుల్లో పోలీసులే స్వయంగా బూర వాయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దారిన వెళ్లే వారి చెవుల్లో పుంగీ వాయించే వికృత చేష్టలను అదుపు చేసేందుకు పోలీసులు ఈ పద్ధతిని అవలంభించారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వికృత చేష్టలను ఎదుర్కొనేందుకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు.

ఇలాంటి పోకిరీలకు గుణపాఠం చెప్పి పుంగిని సీజ్ చేశారు. పోలీసుల కఠినచర్యలపై ఆ ప్రాంతంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వీడియోను చూశారు. పోలీసుల ఈ చర్యను అందరూ అభినందిస్తున్నారు. అబ్బాయిలకు గుణపాఠం చెప్పాలంటే ఇంతకంటే మంచి మార్గం లేదంటూ చాలామంది నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..