Pakistan airlines: ‘సరైన లోదుస్తులు ధరించండి’.. సిబ్బందికి పాక్‌ ఎయిర్‌లైన్స్‌ ఆదేశం.. వీడియో

‘కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు సాధారణ దుస్తులు ధరించడం ఆందోళన కలిగిస్తుంది.

Pakistan airlines: ‘సరైన లోదుస్తులు ధరించండి’.. సిబ్బందికి పాక్‌ ఎయిర్‌లైన్స్‌ ఆదేశం.. వీడియో

|

Updated on: Oct 07, 2022 | 9:48 AM


పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఇటీవల అంతర్గతంగా జారీ చేసిన ఉత్తర్వుపై విమర్శలొచ్చాయి. ‘సరైన లోదుస్తులపై’ సరైన ఫార్మల్‌ డ్రెస్‌ ధరించాలని ఇంటర్నల్‌ మెమోలో ఆ సంస్థ పేర్కొంది. జియో టీవీ కథనం ప్రకారం పీఐఏ తన క్యాబిన్ సిబ్బందికి సూచనలు చేసింది. ‘కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు సాధారణ దుస్తులు ధరించడం ఆందోళన కలిగిస్తుంది. అలాంటి డ్రెస్సింగ్ విధానం చూసేవారికి పేలవమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది. సంస్థపైనా నెగిటివ్‌ ఇమేజ్‌ కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో క్యాబిన్ సిబ్బంది ‘సరైన అండర్‌గార్మెంట్స్’పై సరైన ఫార్మల్ డ్రెస్‌ ధరించాలి. ఆ దుస్తులు కూడా పాకిస్థాన్‌ సంస్కృతికి అనుగుణంగా ఉండాలి’ అని అంతర్గత మెమోలో పేర్కొంది. అయితే ఈ అంతర్గత మెమోపై విమర్శలు వెల్లువెత్తాయి.మరోవైపు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన క్యాబిన్‌ సిబ్బంది ఎక్స్‌ట్రా డ్యూటీ వేళలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ఇటీవల ఈ విషయంపై పీఐఏ సీఈవో అమీర్ హయత్‌కు లేఖ రాసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us