Thailand Floods: నోరు తుఫాను తాకిడికి వణికిపోతున్న థాయిలాండ్‌.. పొంగుతున్న నదులు.. నీట మునిగిన 2,557 గ్రామాలు..

థాయ్‌లాండ్‌లోని ఉత్తర, ఈశాన్య, మధ్య ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. చావోఫ్రయా, మూన్‌, పింగ్‌, యోమ్ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. అదేసమయంలో..

Thailand Floods: నోరు తుఫాను తాకిడికి వణికిపోతున్న థాయిలాండ్‌.. పొంగుతున్న నదులు.. నీట మునిగిన 2,557 గ్రామాలు..
Thailand Floods
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 07, 2022 | 8:37 AM

తుఫాను ధాటికి థాయిలాండ్‌లో వణికిపోతోంది. నదులన్నీ ఉప్పొంగి ఊళ్లు మునిగిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సౌత్‌ ఈస్ట్‌ ఏసియా దేశాలపై నోరు తెరచింది నోరు తుఫాను.ఇప్పటికే పిలిప్పీన్స్‌, వియత్నాంలను అల్లకల్లోలం చేసిన ఈ తుఫాను థాయిలాండ్‌ను కూడా తాకింది. థాయ్‌లాండ్‌లోని ఉత్తర, ఈశాన్య, మధ్య ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. చావోఫ్రయా, మూన్‌, పింగ్‌, యోమ్ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. అదేసమయంలో ప్రాజెక్టుల నీటిని కూడా విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఇళ్లూ, వాహానాలు, ఆస్తులు నష్టపోవాల్సి వచ్చింది.

మూన్ రివర్ పొంగి ప్రవహించడంతో ఉబోన్, నఖోన్ నగరాలు జలమయం అయ్యాయి. వేలాది మందిని ప్రత్యేక శిభిరాలకు తరలించారు. సహాయక సిబ్బంది నడుంలోతు వరద నీటిలోకి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం 85 జిల్లాల్లోని 2,557 గ్రామాలు ప్రభావితమయ్యాయి.

తక్, అయుతయ, అంగ్ థాంగ్, పాతుమ్ థాని, సింగ్ బురి మరియు చై నాట్ జలమార్గం పొంగిపొర్లడంతో ఇబ్బంది పడుతున్నాయి. రాయల్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ చావో ఫ్రయా డ్యామ్ ద్వారా నీటి విడుదల రేటును పెంచిన తర్వాత, అయుతయ ప్రావిన్స్‌లో, మూడు పారిశ్రామిక ఎస్టేట్‌లను లెవల్ 3 కింద ఉంచారు, చావో ఫ్రయా నది నీటి మట్టం ఒక మీటరు పెరిగే అవకాశం ఉంది.  

థాయ్‌లాండ్‌లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అథారిటీ  గురువారం అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసి, మూడు పారిశ్రామిక ఎస్టేట్‌ల చుట్టూ ఉన్న వరద గోడల ఎత్తును 75 సెం.మీ పెంచి, వాటిని 4 మీటర్లకు పెంచాలని ఆదేశించింది. దీంతో  దేశ పర్యాటక రంగం పునరుద్ధరణకు కూడా ప్రమాదం కలిగిస్తుంది..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం