AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liz Truss: బ్రిటన్‌లో గందరగోళం.. ఆ విషయంలో ప్రధాని లిజ్ ట్రస్ యూటర్న్.. అసలేమైందంటే..?

ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తానంటూ ప్రధాని పదవి చేపట్టిన లిజ్‌ ట్రస్‌ ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు.. నిర్ణయాలు బెడిసికొట్టడంతో యూటర్న్‌ తీసుకోక తప్పలేదు..

Liz Truss: బ్రిటన్‌లో గందరగోళం.. ఆ విషయంలో ప్రధాని లిజ్ ట్రస్ యూటర్న్.. అసలేమైందంటే..?
Liz Truss
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2022 | 9:55 PM

Share

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లిజ్‌ ట్రస్‌ కొద్ది వారాల్లోనే తన అసమర్ధతను చాటుకున్నారు. ప్రజలపై పన్నులు భారం తగ్గిస్తానంటూ లిజ్ ట్రస్ చేసిన వాగ్దానం.. చేపట్టిన చర్యలు ఒక్కసారిగా బెడిసికొట్టాయి.. లిజ్‌ట్రస్‌ ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్‌ అంతర్జాతీయంగా అబాసుపాలైంది. సంపన్నులపై పన్నుల భారాన్ని 45 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్థిక మార్కెట్లో గందరగోళం నెలకొన్నది. పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లడంతో బ్రిటన్‌ పౌండ్‌ విలువ పతనమైంది. ప్రభుత్వం ఆర్థిక విశ్వసనీయతను నాశనం చేసిందని బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శించింది. కాగా, ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కూడా లిజ్‌ చర్యలను తప్పుబట్టింది. అసమానతలు, ద్రవ్యోల్భణం పెరుగుతాయని హెచ్చరించింది.

లిజ్‌ ట్రంస్‌.. సొంత పార్టీ నుంచి కూడా పన్ను తగ్గింపు పాలసీ విధానంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పాలసీని వెక్కి తీసుకోవాలంటూ అధికార కన్జర్వేటీవ్‌ పార్టీ సభ్యులు సైతం వత్తిడి తెచ్చారు. దాంతో పాలసీ తీసుకొచ్చిన 10 రోజుల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కాగా.. లిజ్ ట్రస్ నిర్ణయంతో ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతినడంతోపాటు పాలక కన్జర్వేటివ్ పార్టీలోని చట్టసభ సభ్యులు తిరుగుబాటు అనివార్యమని ఓ కీలక సభ్యుడు సైతం పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

అయితే అన్ని వర్గాల సూచనల మేరకే టాప్‌ రేట్‌ పన్ను తగ్గింపును రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమర్ధించుకున్నారు బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌. తాజాగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, కష్టతరమైన శీతాకాలంలో ప్రజలకు సహాయం చేసే విస్తృత ప్రయత్నాలకు ఆటంకంగా మారిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. కన్సర్వేటివ్‌ పార్టీలో ప్రధాని పదవి కోసం లిజ్‌ ట్రస్‌తో పోటీ పడిన రిషి సునాక్‌ పన్నుల తగ్గింపు పాలసీ అసాధ్యమని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఇలాంటి వాగ్దానాలు తాను ఇవ్వబోనన్నారు. చివరకు రిషి సునాక్‌ చెప్పినట్లే జరిగింది. మరోవైపు లిజ్‌ట్రస్‌ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచడంతో నిరసనలు వ్యక్తమయ్యాయి. బిల్లుల కట్టబోమనంటూ ప్రజలు ఆందోళనకు దిగారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..