UK Strain Virus: ఆందోళన కలిగిస్తున్న స్ట్రెయిన్‌ వైరస్‌.. 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్‌: డబ్ల్యూహెచ్‌వో

UK Strain Virus: కరోనా మహమ్మారి కారణంగా ఇంకా బయటపడకముందే యూకే కొత్త రకం కరోనా వైరస్‌తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. కరోనాతో దాదాపు ఏడాది పాటు ..

UK Strain Virus: ఆందోళన కలిగిస్తున్న స్ట్రెయిన్‌ వైరస్‌.. 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్‌: డబ్ల్యూహెచ్‌వో
Follow us

|

Updated on: Jan 20, 2021 | 3:30 PM

UK Strain Virus: కరోనా మహమ్మారి కారణంగా ఇంకా బయటపడకముందే యూకే కొత్త రకం కరోనా వైరస్‌తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. కరోనాతో దాదాపు ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కొత్తగా రూపాంతరం చెందిన స్ట్రెయిన్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి క్రమ క్రమంగా పాకుతోంది. ఈ యూకే వేరియంట్‌ కరోనా వైరస్‌ ఆనవాళ్లు దాదాపు 60 దేశాల్లో ఉన్నట్లు గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గత వారం కన్నా మరో పది దేశాల్లో కొత్త రకం వైరస్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపింది.

ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 20 లక్షలు దాడటంతో, కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం అవుతోంది. యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ తరహాలోనే సౌతాఫ్రికా రకం వైరస్‌ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పౌతాఫ్రికా వేరియంట్‌ కూడా 23 దేశాల్లో పాకింది. తన వీక్లీ రిపోర్టులో డబ్ల్యూహెచ్‌వో ఈ విషయాన్ని వెల్లడించింది. గత వారం రోజుల్లో కరోనా వల్ల 93 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే అదే సమయంలో మరో 4.7 కోట్ల మందికి వైరస్‌ సంక్రమించినట్లు తెలిపింది. ఆగస్టు నాటికి 70 శాతం జనాభాకు కోవిడ్‌ టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూరోపియన్‌ యూనిన్‌ వెల్లడించింది.

కాగా, భారత్‌లో ఈ కొత్త రకం కరోనా వైరస్‌ 141 కేసులకు చేరింది. గత మూడు రోజుల నుంచి ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, నిన్న ఒక్క రోజు 25 కొత్తరకం వైరస్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే బ్రిటన్‌లో ఈ రకం వైరస్‌ వెలుగు చూసిన వెంటనే భారత్‌ అప్రమత్తమైంది. ఆ దేశానికి కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 8 నుంచి తిరిగి విమాన సేవలు ప్రారంభించినప్పటికీ, యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కరోనా పాజిటివ్‌ తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు.

అయితే రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ గడగడలాడిస్తోంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఈ కొత్తరకం స్ట్రెయిన్‌ వైరస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్‌ , సౌతాఫ్రికాలో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిచిన విషయం తెలిసిందే.

కాగా, ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కరోనా లాగే ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు పెరగకుండా ఉండేందుకు అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా తగిన చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.

Also Read:

Strain Virus: భయాందోళనకు గురి చేస్తున్న యూకే స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో కొత్తగా 25 కేసులు నమోదు

Corona Fear: కరోనా భయం.. మూడు నెలలు ఎయిర్‌పోర్టులో దాక్కున్న వ్యక్తి.. అరెస్టు చేసిన పోలీసులు