America White House Name: 18 ఎకరాలు ఉన్న ‘వైట్‌హౌస్‌’ భవనానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

America White House Name: కొన్ని గంటల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్‌ హిల్‌ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రమాణ..

  • Subhash Goud
  • Publish Date - 4:56 pm, Wed, 20 January 21
America White House Name: 18 ఎకరాలు ఉన్న 'వైట్‌హౌస్‌' భవనానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

America White House Name: కొన్ని గంటల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్‌ హిల్‌ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన అధికారిక ఇంటి చిరునామా మారిపోతుంది. అధ్యక్షుడిగా ఆయన కొత్త ఇల్లు వైట్‌ హౌస్‌ అవుతుంది. ఇది ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యానికి నిలయం. అలాగే ప్రపంచ సూపర్‌ పవర్‌ అధిపతి. దీనిని నిర్మించి ఇప్పటికి 210 ఏళ్ల అయింది. అయితే ఈ వైట్‌ హౌస్‌ చరిత్రను పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీనికి వైట్‌ హౌస్‌ అని పేరు ఎలా వచ్చిందనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది.

వందేళ్ల తర్వాత పేరు మార్పు..

కాగా, ఈ భవనం నిర్మించి వందేళ్లకు గానీ ఆ పేరు ఏర్పడలేదు. అంతకు ముందు దీనిని ప్రెసిడెంట్స్‌ ప్యాలెస్‌ అని, ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌ అని పిలుచుకునేవారట. ఒకసారి ఈ భవనంలో మంటలు చెలరేగిన సమయంలో తిరిగి పెయింటింగ్‌ వేసినప్పుడు తెలుపురంగు వేయడంతో అప్పటి నుంచి హౌట్‌ హౌస్‌ అని పేరు వాడుకలో వచ్చింది. 1901లో అధ్యక్షుడిగా ఉన్న రూజ్‌బెల్డ్‌ ఈ పేరును వాడటం మొదలు పెట్టడంతో ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ తన కలను సాకారం చేసుకోవడానికి 1971లో వైట్‌ హౌస్‌ స్థలాన్ని ఎంచుకున్నారు. దీని పునాది రాయి1792లో వేయగా, ఐరిష్‌ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్‌ జేమ్స్‌ హూబన్‌ రూపొందించారు. రెండో అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌ హయాంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు రూ.13 కోట్లు ఖర్చు అయినట్లు అక్కడి అధికార వర్గాల ద్వారా సమాచారం

1812లో యుద్ధం ప్రారంభమైన తర్వాత 1814లో బ్రిటన్‌ ఈ భారీ భవనానికి నిప్పటించింది. అప్పుడు దీనిని పునర్నిర్మించే పనులను జేమ్స్‌ హూబన్కు అప్పగించారు. 1817లో ఈ భవనం పాత రూపానికి తిరిగి వచ్చినప్పుడు, అప్పటి అధ్యక్షుడు జేమ్స్‌ మన్రో అందులో నివసించడానికి వచ్చారు. అతని పదవీకాలంలో అంటే 1824లో దక్షిణ బ్లాక్‌ నిర్మించారు. దీని ఉత్తర బ్లాక్‌ను 1829లో ఆండ్రూ జాక్సన్‌ నిర్మించారు.

వైట్‌హౌస్‌ మొత్తం 18 ఎకరాల స్థలం

ఆరు అంతస్తులు గల ఈ వైట్‌ హౌస్‌ భవనం ఉన్న స్థలం కంచెతో కలిపి మొత్తం 18 ఎకరాలు. భవనం లోపల నిర్మాణ స్థలం 55,000 చదరపు అడుగులు. వైట్‌ హౌస్‌లో మొత్తం 132 గదులు, 142 తలుపులు, 147 కిటికీలు, 35 బాత్‌రూమ్‌లు, 3 ఎలివేటర్లు ఉన్నాయి. ఒకేసారి 140 మంది కూర్చుని తినగలిగే డైనింగ్‌ టేబుల్‌తో పాటు 13 వేల చాకులు, చెంచాలు ఉన్నాయి. దీని నిర్వహణకు 5,700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వైట్‌ హౌస్‌ భూగర్భంలో ఓ బంకర్‌ కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడు ఇక్కడి నుంచే విధులు నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. అంతేకాకుండా కొన్ని సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి.

అయితే 1901లో మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత వైట్‌ పెయింట్‌ వేసిన తర్వాత అధికారికంగా వౌట్‌హౌస్‌ అని పేరు పెట్టారు. రూజ్‌వెల్డ్‌ తరువాత విలియం హూవార్డ్‌ ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడానికి వచ్చినప్పుడు ఓవల్‌ ఆఫీస్‌తో పాటు ఇక్కడ ఒక పెద్ద కార్యాలయ విభాగాన్ని నిర్మించారు. ఇక మరమ్మతులు చేసిన 50 ఏళ్ల తర్వాత భవనం బలహీనపడుతున్నట్లు కనిపించడంతో మరోసారి మరమ్మతు బాధ్యతను అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్‌ వాస్తుశిల్పి లారెంజో విన్సోలకు అప్పగించారు. అదే సమయంలో దీని బయటి గోడ తొలగించారు. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత 1952 ట్రూమాన్‌ తన కుటుంబంతో కలిసి ఈ భవనంలో తిరిగి వచ్చాడు. అయితే వైట్‌హౌస్‌ భవనం యొక్క గోడలపై జాన్‌ ఆడమ్‌ నుంచి నేటి వరకు అందరి అధ్యక్షుల చిత్రాలున్నాయి. అంతేకాకుండా ప్రపంచ నాయకుల వినోదం కోసం ప్రత్యేక స్థలం కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమెరికన్‌ చరిత్ర గురించి సమాచారం ఇవ్వడానికి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.

Also Read: జో బైడెన్ సక్సెస్ కోసం ప్రార్థించండి, తుది వీడ్కోలు సందేశంలో డొనాల్డ్ ట్రంప్, డెలావర్ నుంచి వాషింగ్టన్ బయలుదేరిన బైడెన్