జో బైడెన్ సక్సెస్ కోసం ప్రార్థించండి, తుది వీడ్కోలు సందేశంలో డొనాల్డ్ ట్రంప్, డెలావర్ నుంచి వాషింగ్టన్ బయలుదేరిన బైడెన్

అధికారం నుంచి దిగిపోతున్న డొనాల్డ్ ట్రంప్...ఇన్నాళ్ళకు మౌనం వీడారు. నూతన అధ్యక్షుడు కానున్న జో బైడెన్ సక్సెస్ కోసం ప్రార్థించాలని..

జో బైడెన్ సక్సెస్ కోసం ప్రార్థించండి, తుది వీడ్కోలు సందేశంలో డొనాల్డ్ ట్రంప్,  డెలావర్ నుంచి వాషింగ్టన్ బయలుదేరిన బైడెన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 4:36 PM

అధికారం నుంచి దిగిపోతున్న డొనాల్డ్ ట్రంప్…ఇన్నాళ్ళకు మౌనం వీడారు. నూతన అధ్యక్షుడు కానున్న జో బైడెన్ సక్సెస్ కోసం ప్రార్థించాలని ఆయన అమెరికన్లను కోరారు. ఈ మేరకు తుది వీడ్కోలు మెసేజ్ ఇస్తూ.. ఆయన చేసిన ప్రసంగం తాలూకు వీడియోను వైట్ హౌస్ రిలీజ్ చేయనుంది. సంప్రదాయం ప్రకారం ట్రంప్..బైడెన్ ను గ్రీట్ చేయాల్సి ఉంది. మరి ఇప్పటివరకు అలాంటి దాఖలాలు కనబడలేదు. ట్రంప్ ఇక ఫ్లోరిడాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  సుమారు 100 మందికి ఆయన ఇంకా క్షమాభిక్షను ప్రసాదించవలసి ఉంది. ఆయనపై అభిశంసనకు సంబంధించిన విచారణను సెనేట్ చేపట్టనుంది.  అటు – తన సొంత రాష్ట్రం డెలావర్ ను వీడేముందు జో బైడెన్ భావోద్వేగంతో చలించిపోయారు. మరణించిన తన కొడుకుకు శ్రధ్ధాంజలి ఘటించిన ఆయన దాదాపు కన్నీటి పర్యంతమయ్యారు. డెలావర్ ను వీడుతున్నానని, వాషింగ్టన్ బయలుదేరుతున్నానని, తాను మృతి చెందినా తన గుండెలమీద ఈ రాష్ట్రం పేరు ఉంటుందని భారమైన హృదయంతో ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా వాషింగ్టన్ లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి అంతా సిధ్దమైంది. అయితే  ఈ కార్యక్రమం సందర్భంలో ట్రంప్ మద్దతుదారులు మళ్ళీ ఏదైనా రభస సృష్టిస్తారా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 6 న క్యాపిటల్ హిల్ లో జరిగిన ఘటనల వంటివి పునరావృతమవుతాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పటిష్టమైన భద్రత మధ్య  అధ్యక్షునిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా   కమలా హారిస్ ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెడ్ అండ్ గ్రీన్ జోన్లుగా మార్గాలను విభజించి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా నేషనల్ గార్డులను నియమించారు.సుమారు 20 వేలమంది గార్డులు అప్రమత్తంగా ఉన్నారు.

Also Read:

పూళ్ల గ్రామంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 28 కి చేరిన వ్యాధిగ్రస్థులు.. స్పందించిన మంత్రి ఆళ్లనాని ఏం చెప్పారంటే..

TDP VS YCP: రాజకీయ రంగు పులుముకున్న ప్రేమ వ్యవహారం… అమ్మాయి కుటుంబంపై అబ్బాయి తరఫు బంధువుల దాడి..

Suicide: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రాణాలు తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌… ఉరేసుకొని ఆత్మహ్యత చేసుకున్న పటాన్‌చెరు వాసి..