ఇక ట్రంప్ ఆదేశాలన్నీ బుట్టదాఖలు, ముస్లిం ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయనున్న జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ..ఇక డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను బుట్టదాఖలు చేయనున్నారు. ముస్లిం ట్రావెల్ బ్యాన్ ని ఎత్తివేయడమే కాక..

  • Umakanth Rao
  • Publish Date - 5:49 pm, Wed, 20 January 21
ఇక ట్రంప్ ఆదేశాలన్నీ బుట్టదాఖలు, ముస్లిం  ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయనున్న జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ..ఇక డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను బుట్టదాఖలు చేయనున్నారు. ముస్లిం ట్రావెల్ బ్యాన్ ని ఎత్తివేయడమే కాక, అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి సంబంధించి ట్రంప్ జారీ చేసిన ఆర్డర్స్ ను కూడా ఉపసంహరించనున్నారు. అధ్యక్షునిగా ప్రమాణం చేయగానే ఆయన మొత్తం 17 ఉత్తర్వులపై సంతకం చేస్తారు. పలు ముస్లిం దేశాల నుంచి ప్రజలు యూఎస్ లోకి ప్రవేశించకుండా ట్రంప్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా  వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సైతం బైడెన్ ఉపసంహరించే అవకాశాలున్నాయి. వైట్ హౌస్ లో కోవిడ్ 19 రెస్పాన్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న యోచన కూడా ఆయనకు ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా దేశంలో కోవిడ్ అదుపు, దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవం,  ప్రభుత్వ, విద్యా సంస్థల్లో రెసిజానికి అడ్డుకట్ట వంటివి బైడెన్ ముందు పెను సవాళ్లుగా ఉన్నాయి. వీటిపై మొదట ఆయన దృష్టి సారించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే జో బైడెన్..పూర్తిగా ట్రంప్ ఆదేశాలకు అడ్డుకట్ట వేసినట్టే. మేక్ ఇన్ అమెరికా అని ట్రంప్ లోగడ నినాదం చేశారుగానీ ఆయన ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటున్నారు. చైనాతో గిల్లికజ్జాలు, ఇరాన్ తో కయ్యం వంటి విదేశీ విధానాలు కూడా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టేశాయి.