ఫేస్ మాస్కులు ధరించనందుకు అక్కడ విదేశీయులకు వింత శిక్ష, లేదా జరిమానా, ఇదే మొదటిసారి,ఎక్కడో తెలుసా ?

ఫేస్ మాస్కులు ధరించని విదేశీయులకు ఒక చోట వింత శిక్ష విధిస్తున్నారు. ఎక్కడ  ? ఇండోనేసియా లోని రిసార్ట్ ఐలాండ్ బాలిలో..

  • Umakanth Rao
  • Publish Date - 3:21 pm, Wed, 20 January 21
ఫేస్ మాస్కులు ధరించనందుకు అక్కడ విదేశీయులకు వింత శిక్ష, లేదా జరిమానా, ఇదే మొదటిసారి,ఎక్కడో తెలుసా ?

ఫేస్ మాస్కులు ధరించని విదేశీయులకు ఒక చోట వింత శిక్ష విధిస్తున్నారు. ఎక్కడ  ? ఇండోనేసియా లోని రిసార్ట్ ఐలాండ్ బాలిలో దీన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటివారికి ఎర్రటి ఎండలో 50 పుషప్ లు తీయాలని ఆదేశిస్తున్నారు. టీ షర్టులు   ధరించిన టూరిస్టులు ఇలా పుషప్ లు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్ళు ఎన్ని చేస్తున్నారో లెక్క పెట్టేందుకు అక్కడే సెక్యూరిటీ అధికారులు ఉంటారు. చెమటలు కక్కుతూ టూరిస్టులు వీటిని తీయాల్సిందే.. ఇండోనేసియాలో కోవిద్ మహమ్మారి కారణంగా గత  ఏడాది నంచి ఫేస్ మాస్కుల ధారణ తప్పనిసరి చేశారు. టూరిస్టుల్లో చాలామంది మాస్కులు ధరించకుండా ఇక్కడికి వస్తుంటారు. ఇటీవల 70 మందికి పైగా విదేశీయులకు 7 డాలర్ల చొప్పున జరిమానా విధించగా.. 30 మంది తమ వద్ద డబ్బు లేదని చెప్పడంతో దీనికి బదులు పుషప్ లు తీయాలని ఆదేశిస్తున్నారు.  ఈ శిక్షను కఠినంగా అమలు చేస్తున్నారు.