Rishab Pant : టెస్ట్ ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించిన ఐసీసీ… పంత్ ర్యాంక్ ఎంతో తెలుసా..?

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ 13వ...

Rishab Pant : టెస్ట్ ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించిన ఐసీసీ... పంత్ ర్యాంక్ ఎంతో తెలుసా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 20, 2021 | 3:34 PM

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ 13వ స్థానానికి ఎగ‌బాకాడు. ఇక‌ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో బెస్ట్ ర్యాంక్ ఉన్న వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ పంతే కావ‌డం విశేషం. అతని త‌ర్వాత సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డీకాక్ (15) ఉన్నాడు.

భార‌త ఆట‌గాళ్ల ర్యాంకులివే…

కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. తొలి రెండు స్థానాల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్ కొన‌సాగుతున్నారు. ఆస్ట్రేలియా మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్ మార్న‌స్ లబుషేన్.. కోహ్లిని వెన‌క్కి నెట్టి మూడోస్థానానికి దూసుకెళ్లాడు. భార‌త‌ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 47వ స్థానానికి చేరుకున్నాడు. ఐదు వికెట్ల‌తో రాణించిన మ‌న హైద‌రాబాదీ సిరాజ్‌ ఏకంగా 32 స్థానాలు ఎగ‌బాకి 45వ స్థానానికి చేరుకున్నాడు. అటు పుజారా ఒక స్థానం మెరుగుప‌ర‌చుకొని ఏడో స్థానంలో ఉన్నాడు.

Also Read: Praneeth Out of Thailand Open: థాయిలాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్ ఔట్.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ