Tipu Sultan: టిప్పు సుల్తాన్ సింహాసనంలోని పులి తలను వేలానికి పెట్టిన యూకే.. దొంగిలించిన వాటిని అమ్మడమేంటి అంటూ నెటిజన్లు ఫైర్
Tipu Sultan Throne: యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క డిజిటల్, సంస్కృతి, మీడియా మరియు క్రీడల విభాగం భారతదేశం నుండి దొంగిలించబడిన టిప్పుసుల్తాన్ సింహాసనంలోని..
Tipu Sultan Throne: యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క డిజిటల్, సంస్కృతి, మీడియా మరియు క్రీడల విభాగం భారతదేశం నుండి దొంగిలించబడిన టిప్పుసుల్తాన్ సింహాసనంలోని ముందరి భాగాన్ని £1.5 మిలియన్లకు వేలానికి పెట్టింది. మన దేశ కరెన్సీలో రూ. 14,98,64,994కి వేలం వేస్తోంది. 8వ శతాబ్దంలో భారతదేశంలో మైసూరు చక్రవర్తి టిప్పు సుల్తాన్ సింహాసనానికి చెందిన బంగారు పులి తలని ఇప్పుడు వేలానికి పెట్టడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. “టైగర్ ఆఫ్ మైసూర్” అని కూడా పిలువబడే టిప్పు సుల్తాన్ సింహాసనంలోని ఎనిమిది బంగారు పులి తలలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇప్పుడు వేలానికి పెట్టింది యూకే. అయితే ఈ సింహాసనం గురించి 2009 వరకు ప్రపంచానికి తెలియదు.
ఇదే విషయంపై యూకే ఆర్ట్స్ మినిస్టర్ లార్డ్ స్టీఫెన్ పార్కిన్సన్ స్పందిస్తూ.. “టిప్పు సుల్తాన్ సింహాసనానికి వేలానికి భారీ రెస్పాన్స్ వస్తుందని అన్నారు. అంతేకాదు భారతదేశంలో బ్రిటీషర్ల భాగస్వామ్య పాలన గురించి ఈ తరానికి తెలియజేయటమే తమ ఉద్దేశ్యమని.. అందుకనే పులి తలను వేలానికి పెట్టామని చెప్పారు.
ఈ బంగారంతో తయారు చేయబడిన ఈ సింహాసనంలో కెంపులు, పచ్చలు, వజ్రాలు అమర్చారు. 18వ శతాబ్దపు దక్షిణ భారత స్వర్ణకారుల కళా నైపుణ్యానికి ఇది చిహ్నం. టిప్పు సుల్తాన్ 1799లో ఓడిపోయి మరణించే వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓ రేంజ్ లో వణికించాడు. అయితే, యూకే తీరుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. భారత్ నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులను బహిరంగంగా వేలం వేలానికి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోచుకున్న వస్తువులను విక్రయించడానికి ప్రయత్నించడం, ఎగుమతి నిషేధంపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తారు. బ్రిటిష్ మ్యూజియం అసలైన బ్రిటిష్ వస్తువులను వేలానికి పెట్టాలని.. అంతేకాని భారత దేశం నుంచి దొంగలించి తీసుకుని వెళ్లిన వస్తువులను కాదని అంటున్నారు. భారత్ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సందపను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా బ్రిటన్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు.
అయితే టిప్పు సుల్తాన్ సింహాసనం యూకే దాటిపోయే ప్రమాదం ఉందని.. కనుక ఆసక్తి గలకొనుగోలుదారులు కమిటీ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన 0845 300 6200 నంబరుకు కాల్ చేయాలని బ్రిటన్ ప్రభుత్వ డిజిటల్, సంస్కృతి, మీడియా, క్రీడల శాఖ సోషల్ మీడియా వేదికగా కోరుతుంది.
A £1.5 million throne finial is at risk of leaving the UK ??
An export bar has been placed on the Tipu Sultan Throne finial to give time for an organisation or individual to purchase it.
Interested? Contact the Committee’s Secretariat on 0845 300 6200 ?#TipuSultan #Art pic.twitter.com/Lf6ElSjB1U
— DCMS (@DCMS) November 12, 2021
Also Read: ఈ సీజన్‌లో దొరికే కమలా పండు షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కటి డైట్.. మరిన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
అప్పు సేవలను కొనిసాగిస్తా.. ఇల్లు కంటే 1800 మంది విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమంటున్న హీరో విశాల్..