AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నేపాల్‎లో భయంకరంగా హిమపాతం.. వైరల్ అయిన వీడియో..

మంచు కొండలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రశాంతమై వాతావరణంలో ఆ పర్వతాలను చూస్తే సంతోషం వేస్తుంది. కానీ ఒక్కసారిగా ఆ మంచు మనపైకి వస్తే పరుగెత్తడమే. నేపాల్‌లో మంచుతో కప్పబడిన పర్వతంపై భారీ హిమపాతం సంభవించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది...

Viral Video: నేపాల్‎లో భయంకరంగా హిమపాతం.. వైరల్ అయిన వీడియో..
Snow
Srinivas Chekkilla
|

Updated on: Nov 17, 2021 | 9:21 AM

Share

మంచు కొండలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రశాంతమై వాతావరణంలో ఆ పర్వతాలను చూస్తే సంతోషం వేస్తుంది. కానీ ఒక్కసారిగా ఆ మంచు మనపైకి వస్తే పరుగెత్తడమే. నేపాల్‌లో మంచుతో కప్పబడిన పర్వతంపై భారీ హిమపాతం సంభవించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో మంచుతో కప్పబడిన పర్వతల్లో ఒక్కసారిగా అతి పెద్ద హిమపాతం సంభవించింది. దీంతో అక్కడున్నవారందరూ భయంతో అరుస్తూ పరుగులు పెంటారు. అంతే అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా భయంకరంగా మారింది. తెల్లటి బిళ్లలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు కనిపించడం వలన అనేక మంది రక్షణ కోసం పరిగెత్తడం కనిపించింది.

నవంబర్ 14న దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సంఘటనను చిత్రీకరిస్తున్న వ్యక్తి సురక్షితంగా పారిపోవడాన్ని ప్రారంభించినప్పుడు ఫుటేజ్ కదిలిదినట్లు వీడియో తెలుస్తుంది. 30 నిమిషాల పాటు కొనసాగిన మంచు స్లైడ్‌లో ఏడుగురు విద్యార్థులతో సహా 11 మంది గాయపడ్డారు. మంచు ఒక పాఠశాలపైకి దొర్లినట్లు వార్తా సంస్థకు ఒక అధికారిని చెప్పారు. ” పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమపాతం 30 నిమిషాల పాటు కొనసాగింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఎక్కువ మంది స్థానిక పాఠశాల విద్యార్థులు,” చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ముస్తాంగ్ అని నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.

Read Also.. Painful Vacation: టాయ్‌లెట్‌కి వెళ్లిన పర్యాటకుడిపై కాలనాగు దాడి.. కాటు ఎక్కడ వేసిందంటే..?