Viral Video: అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి అనుకోని అతిథి.. ఆ పాప కానీ ఏడవకపోయి ఉంటే
కుటుంబం పెద్దది.. ఇల్లు చిన్నది అయినప్పుడు, ఇంట్లో చాలా మంది సభ్యులు నేలపై పడుకోవడం మీరు తరచుగా చూస్తూనే ఉంటారు.
కుటుంబం పెద్దది.. ఇల్లు చిన్నది అయినప్పుడు, ఇంట్లో చాలా మంది సభ్యులు నేలపై పడుకోవడం మీరు తరచుగా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే అంతమందికి సరిపోను మంచాలు వేయడానికి అక్కడ సరిపడా ప్లేస్ ఉండదు. అయితే కింద పడుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, కొన్నిసార్లు బొద్దింకలు, కీటకాలు చెవిలోకి ప్రవేశించడం గురించి మనం విన్నాం. కొన్నిసార్లు పాము కాట్లు కూడా సంభవించాయి. తాజాగా బ్యాంకాక్ నుంచి ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటి నేలపై నిద్రిస్తున్నారు. ఓ పాప టీవీ చూస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక మానిటర్ బల్లి (ఉడుము) ఇంట్లోకి ప్రవేశించి.. వారి పక్కనుంచి వెళ్లింది. ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, కొంతమంది కుటుంబ సభ్యులు నేలపై పడుకోవడం మీరు చూడవచ్చు. ఒక అమ్మాయి టీవీ చూస్తుండగా… ఇంతలో అక్కడికి మానిటర్ బల్లి (ఉడుము) ఎంటరయ్యింది. దాన్ని చూసి ఆ ఇంట్లోని చిన్నారి భయపడి పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. బాలిక ఏడుపు చూసి కుటుంబ సభ్యులు నిద్రలేచారు. అనంతరం, అమ్మాయి సైగలు చేసి ఇంట్లోకి ప్రవేశించిన మానిటర్ బల్లి (ఉడుము) గురించి చెబుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లోని వ్యక్తి కర్ర తీసుకుని దానిని బయటకు తరుముతాడు.
వీడియో వీక్షించండి
What a wake-up! A family in Bangkok was awakened from their nap when a monitor lizard crawled inside their home. The family was unharmed and chased the lizard out. pic.twitter.com/yRPnFvodsN
— CGTN America (@cgtnamerica) November 16, 2021
ఈ వీడియో చూసిన చాలా మంది భయాందోళనకు గురయ్యారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘ఇది నిజంగా భయానకంగా ఉంది, మానిటర్ బల్లి ఎవరినైనా కరిచి ఉంటే, అప్పుడు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అని ఓ యూజర్ స్పందించాడు. ‘సోదరా! నేలపై పడుకోవడం నిజంగా ప్రమాదకరం’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ఆ అమ్మాయి తనను, తన కుటుంబాన్ని రక్షించింది.’ అని మరో నెటిజన్ స్పందనను తెలిపాడు. ఈ వీడియోకు వందల కొద్దీ రీట్వీట్లు, లైకులు కూడా వస్తున్నాయి.
Also Read: Tollywood Heroine: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి… ఇలా మాయమైంది
Ap Weather: ‘జవాద్’ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక