kajal aggarwal Pregnancy: కాజల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. సీక్రెట్‌ చెప్పిన చందమామ..!(వీడియో)

kajal aggarwal Pregnancy: కాజల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. సీక్రెట్‌ చెప్పిన చందమామ..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 17, 2021 | 8:42 AM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ స్టార్ హీరోయిన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరుతో ఆచార్య సినిమాలో నటిస్తోంది.


టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ స్టార్ హీరోయిన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరుతో ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో పలు చిత్రాలకు అగ్రిమెంట్ ఇవ్వగా.. కాజల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇక ఇదే విషయంపై తాజాగా స్పందించిన కాజల్.. తల్లిగా మారడం ఓ అద్భుతమైన అనుభూతి అంటూ చెప్పుకొచ్చింది. ఆ స్టేజ్‌లోనే సెల్ఫ్​రియలైజేషన్ ​అవుతారంటూ చెప్పింది…. తన చెల్లి కొడుకును ఎత్తుకుంటే తాను అమ్మను అనే ఫీలింగ్ వస్తోందని.. తాను, గౌతమ్.. ఇంట్లో ఉన్న మియా అనే పెంపుడు కుక్కకు కూడా తల్లిదండ్రులుగా ఫీలవుతున్నామని చెప్పింది. ప్రెగ్నెంట్ విషయంలో ఇప్పుడు తాను మాట్లాడాలని అనుకోవట్లేదని.. సరైన సమయంలో స్పందిస్తా అంటూ క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..