AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Heroine: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి… ఇలా మాయమైంది

నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

Tollywood Heroine: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి... ఇలా మాయమైంది
Anshu Ambani
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2021 | 8:55 AM

Share

నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. విజయ్ భాస్కర్ తెరకెక్కించారు. అప్పట్లో నాగ్ కెరీర్‌లోనే ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పాలి. మన్మథుడు సినిమా ఇప్పుడు వస్తున్నా కూడా అందరూ టీవీలకు అతుక్కుపోతారు . అలాంటి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వచ్చింది. ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్స్‌గా నటించారు. ఇరువురి పాత్రలు కూడా ఎంతో అద్భుతంగా రాశాడు త్రివిక్రమ్. ముఖ్యంగా అన్షు పాత్ర సినిమా చూశాక కూడా ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటుంది. ఈ సినిమా అనంతరం ప్రభాస్ హీరోగా వచ్చిన రెండో సినిమా రాఘవేంద్రలో అన్షు నటించింది. యాధృచ్చికంగా ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసింది ఈ బ్యూటీ. ఈ రెండూ కాక నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. చాలా తక్కువ సినిమాలు చేసిన అన్షు.. లండన్‌లోనే సెటిల్ అయిపోయింది.  అక్కడే పుట్టి పెరగడంతో ఇండస్ట్రీకి కూడా గెస్ట్‌లా వచ్చి వెళ్లింది. లండన్‌లోనే బిజినెస్‌మేన్ సచిన్ సగ్గార్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తోంది అన్షు.

అయితే అన్షు గురించి ఇటీవల కాలంలో ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాలో ఈమె హీరో అక్క పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆమెను గ్లామర్ క్వీన్‌గా చూసిన ఫ్యాన్స్‌కు.. ఇలాంటి పాత్రల్లో ఊహించుకోవడం కొంచెం కష్టమే అని చెప్పాలి. అసలు ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Also Read: Ap Weather: ‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?