Kamala Orange: ఈ సీజన్‌లో దొరికే కమలా పండు షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కటి డైట్.. మరిన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Kamala Orange: ప్రకృతి మానవాళికి ప్రసాదించిన వరం మొక్కలు.  పండ్లు, ఆకులు, వేర్లు, కాండం ఇలా అనేక భాగాలూ ఓషధులుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సీజన్ కు అనుగుణంగా..

Kamala Orange: ఈ సీజన్‌లో దొరికే కమలా పండు షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కటి డైట్.. మరిన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Mandarin Orange
Follow us

|

Updated on: Nov 17, 2021 | 8:04 AM

Kamala Orange: ప్రకృతి మానవాళికి ప్రసాదించిన వరం మొక్కలు.  పండ్లు, ఆకులు, వేర్లు, కాండం ఇలా అనేక భాగాలూ ఓషధులుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సీజన్ కు అనుగుణంగా లభించే పండ్లు శరీరానికి మేలు చేస్తాయి. కాలాలకు అనుగుణంగా ఆయా సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఈరోజు ఈ సీజన్ లో లభించే కమలా పండు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

కమలా పండు నిమ్మపండు లాగనే ఇది సిట్రస్ ప్రజాతికి చెందిన పండు. సంకర జాతి సిట్రస్ పండు.  ఎక్కువగా దక్షిణతూర్పు ఆసియా దేశాలైన భారత్ , చైనా, వియత్నాంలలో పెరుగుతుంది.  కమలా ఫండులో తీపి కమలా, చేదు కమలా అనే రెండు రకాలుంటాయి. ఈ కమలా పండుని పండ్లగా తినడానికే కాదు.. కేకులు, కూల్ డ్రింక్స్, ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనాలో ఈ కమల పండ్లను అదృష్ట్యానికి చిహ్నంగా భావిస్తారు. చైనా న్యూ ఇయర్ వేడుకల్లో బంధువులకు, స్నేహితులకు, కానుకగా ఇస్తారు.

 సాంప్రదాయ వైద్యం:  సాంప్రదాయ చైనీస్ ఔషధంగా కమలా పండుని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జీర్ణక్రియకు ఉపయోగిస్తారు. ఈ కమల పండ్లలో పోషకాలు మెండు. ముఖ్యంగా విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఆమ్లాలు ఉన్నాయి. వీటి పండ్లు , ఆకులు సౌందర్య సాధనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్ల,, రక్తస్రావ నివారిణి, అజీర్తి, గ్యాస్ట్రో పేగుల కఫంతో వున్నా దగ్గు, చికిత్సలో ఉపయోగిస్తారు.

*కమలాపండులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. శరీర బరువు తగ్గాలనుకొనే వారు రోజూ కమలాపండు డైట్ లో చేర్చుకోవడం మంచి ఫలితం ఉంటుంది.

* షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్ కమలా పండు రోజూ ఒకటి తినడం వలన షుగర్ లెవెల్స్  అదుపులో ఉంటాయి.

* కమలా పండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు. అంతేకాదు మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

* కమలాపండులో ఉన్న క్యాల్షియం ఎముకల దృఢత్వానికి , కండరాలు గట్టిపడేలా కమలా పండు చేస్తుంది.

* కమలాపండులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.

* కమలాపండును తినడం రోజూ తినడం వలన చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మంపై ఏర్పడే ముడతలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా.. యవ్వనంగా కనబడుతుంది.

Also Read:  అప్పు సేవలను కొనిసాగిస్తా.. ఇల్లు కంటే 1800 మంది విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమంటున్న హీరో విశాల్..