Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth-Vishal: అప్పు సేవలను కొనిసాగిస్తా.. ఇల్లు కంటే 1800 మంది విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమంటున్న హీరో విశాల్..

Puneeth-Vishal: పునీత్ రాజ్ కుమార్ మరణించి చిరంజీవి.. పునీత్ మంచితనం, మానవత్వం గురించి అభిమానులే కాదు.. సాటి నటీనటులు తలచుకుంటూ.. ఆయనతో అనుబంధనాన్ని..

Puneeth-Vishal: అప్పు సేవలను కొనిసాగిస్తా.. ఇల్లు కంటే 1800 మంది విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమంటున్న హీరో విశాల్..
Puneeth Vishal
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 7:27 AM

Puneeth-Vishal: పునీత్ రాజ్ కుమార్ మరణించి చిరంజీవి.. పునీత్ మంచితనం, మానవత్వం గురించి అభిమానులే కాదు.. సాటి నటీనటులు తలచుకుంటూ.. ఆయనతో అనుబంధనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ చిత్ర పరిశ్రమ నివాళులర్పించేందుకు పునీత్ నామా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విశాల్ హాజరయ్యాడు. పునీత్ రాజ్ కుమార్ చదివిస్తున్న  1800 మంది పిల్లల చదువుకు బాధ్యత విశాల్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్ మాట్లాడుతూ.. ఆ 1800 మంది పిల్లల చదువు బాధ్యత నాదే… మళ్ళీ ఇదే విషయాన్ని నటుడు విశాల్ ‘పునీత్ నమన్’లో చెప్పాడు.

 విశాల్ ఏం చెప్పాడంటే: 

నాకు కొంచెం కన్నడ తెలుసు.. మా అన్న. పునీత్ ముఖం ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తోంది. రెండు రోజులు నేను పునీత్ మరణించారనే విషయాన్నీ నమ్మలేదు. ఇంకా చెప్పాలంటే పునీత్ మరణవార్తను నేను వినలేకపోయాను. అంతేకాదు పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యే ధైర్యం నాకు లేదు. అందుకనే నేను పునీత్ అంత్యక్రియలకు హాజరుకాలేదని విశాల్ చెప్పారు. అయితే శివన్న, రాఘన్న, అప్పు కుటుంబ సభ్యులకు విశాల్ ఓ విన్నపం చేశారు.

తనకు పునీత్ చవిస్తున్న పిల్లలను  చదివించే అవకాశం ఇవ్వమని అన్నారు. అంతేకాదు తనకు ఇప్పటి వరకూ సొంతం ఇల్లు లేదని.. ఇప్పటికే నేను ఇల్లు కొనుక్కొని ఉండాల్సింది.. అయితే పట్టించుకోలేదు.. అయితే ఇల్లు కొనుకోవాలని తాను కొంత మొత్తం దాచినట్లు ఆ డబ్బులను ఇప్పుడు ఈ 1800 మంది స్టూడెంట్స్ చదువుకు ఉపయోగిస్తానని చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చే ఏడాది కూడా ఇల్లు కొనగలను.  ఇప్పుడు నాకు పిల్లల విద్య చాలా ముఖ్యం. పునీత్ పేరు ఎన్ని సంవత్సరాలైనా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎవ్వరికీ తెలియకుండా ఎంతో మందికి సాయం చేశాడు. అతని హృదయం ప్రపంచమంతటికీ తెలుసు. పునీత్ లాంటి వ్యక్తిని మర్చిపోలేం. పునీత్‌తో నాకు అంత సన్నిహిత రిలేషన్ లేదు.. అయినప్పటికీ రెండు రోజులు నిద్ర పోలేదని విశాల్ చెప్పారు. అప్పు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలంటే అతని చేపట్టిన మంచి పనులు ఎప్పటికీ కొనసాగాలని చెప్పారు విశాల్

కన్నడ చిత్ర పరిశ్రమ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కు నివాళులర్పించేందుకు  కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘పునీత్ నామా’ పునీత్ నమన ) కార్యక్రమం నిర్వహించబడింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లోని గాయత్రీ విహారలో ‘పునీత్ నామన్’ జరిగింది. ‘పునీత్‌ నామన’ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, తారలు, ప్రముఖులు, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, బీఎస్‌ యడ్యూరప్ప, డీకే శివకుమార్‌, ఆర్‌ అశోక్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read:   వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న గున్న ఏనుగు.. తొండం కోల్పోయి మృతి.. రోజు రోజుకీ అంతరించిపోతున్న జాతి