Baby Elephant: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న గున్న ఏనుగు.. తొండం కోల్పోయి మృతి.. రోజు రోజుకీ అంతరించిపోతున్న జాతి

Baby Elephant: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఒక పిల్ల ఏనుగు మంగళవారం మరణించింది. వేటగాళ్లు పన్నిన ఉచ్చులో గున్న ఏనుగు సగం తొండం కోల్పోయింది. గున్న ఏనుగుకు..

Baby Elephant: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న గున్న ఏనుగు.. తొండం కోల్పోయి మృతి.. రోజు రోజుకీ అంతరించిపోతున్న జాతి
Baby Elephant
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 6:57 AM

Baby Elephant: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఒక పిల్ల ఏనుగు మంగళవారం మరణించింది. వేటగాళ్లు పన్నిన ఉచ్చులో గున్న ఏనుగు సగం తొండం కోల్పోయింది. గున్న ఏనుగుకు తొండానికి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేదని పశువైద్యులు తెలిపారు. సుమత్రా దీవిలో ఇప్పటికే అంతరించిపోతున్న ఏనుగులను వేటగాళ్లు వేటాడడంపై వన్య ప్రాణ సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచే జయ జిల్లాలోని అటవీ గ్రామమైన అలూ మెరక్సాలో రెండు రోజుల క్రితం తొండం కుళ్ళిన స్థితిలో ఉన్న ఏడాది వయసున్న గున్న ఏనుగును అటవీ శాఖ అధికారులు గుర్తింహచారు. వెంటనే గున్న ఏనుగును సంరక్షణ కేంద్రానికి తరలించారు. గున్న ఏనుగును పరిశీలించిన వైద్య సిబ్బంది.. వేటగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకోవడం వలనే గున్న ఏనుగు తొండం కూలిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఏనుగుకు ఆపరేషన్ చేసి తొండం తొలగించారు.

ఆపరేషన్ చేసిన అనంతరం గున్న ఏనుగు ఆరోగ్యంగానే కనిపించిందని.. అయినప్పటికీ గున్న ఏనుగు మరణించిందని.. ఇది తమను షాక్ గురిచేసిందని వెటర్నరీ వైద్యులు రికా మార్వాతీ చెప్పారు. గున్న ఏనుగుని బతికించడానికి మా వంతు ప్రయత్నం మేము చేశామని.. అయినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయామని విచారణ వ్యక్తం చేశారు. ఇన్‌ఫెక్షన్‌ వలెనే ఏనుగు మరణించినట్లు భావిస్తున్నామని.. పోస్టుమార్టంలో ఏనుగు పిల్ల మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. ఏనుగు పిల్ల మృతికి గల కారణాలను గుర్తించేందుకు పశువైద్యుల బృందం శవపరీక్ష జరుపుతోందని అరియాంటో విలేకరులకు తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్ధిక కల్లోలంతో సుమిత్రలోని గ్రామస్థులు ఎక్కువగా వేటకు మొగ్గు చూపుతున్నారని వన్య ప్రాణ సంరక్షకులు అంటున్నారు. అంతేకాదు గత తొమ్మిదేళ్లలో తూర్పు అచే జిల్లాలో వేటగాళ్లు పన్నిన వలలు, విషం కారణంగా ఏనుగుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని.. తాజాగా గున్న ఏనుగు మరణించిడంతో 25 కు చేరిందని అరియాంటో చెప్పారు.  ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమత్రాన్ లో ఏనుగుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుందని.. 2014 లో 1300 ఉండగా ఇప్పుడు ఏనుగులు సంఖ్య 693 కి చేరుకుందని ఇండోనేషియా అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలద్వారా తెలుస్తోంది. గత ఏడేళ్లలో దాదాపు 50% తగ్గిందలను సూచిస్తుంది.

ఇదిలాఉంటే.. సుమత్రా ద్వీపంలో గతకొంతకాలంగా ఏనుగులు వేటగాళ్ల చేతికి చిక్కి పదుల సంఖ్యలో మరణిస్తున్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది. గత జులై నెలలో తూర్పు ఆచేలోని తాటి తోటలో తల తెగిపోయిన ఓ ఏనుగు మృతదేహాన్ని చూసినదాన్ని బట్టి వేటగాళ్లు ఎంతటి రుణాలకు ఒడిగడుతున్నారో తెలుస్తోందని అటవీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన ఏనుగు నుంచి దంతాలను దొంగలించినట్లు అధికారులు గుర్తించి.. ఆ ఏనుగు దంతాలను కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులతో పాటు అనుమానాస్పద వేటగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read:

టాయ్‌లెట్‌కి వెళ్లిన పర్యాటకుడిపై కాలనాగు దాడి.. కాటు ఎక్కడ వేసిందంటే..?

 మీరు ఎప్పుడైనా పట్టాల కింద వేలాడుతూ నడిచే రైళ్లను చూశారా..? ఇదిగో మీ కోసం..!