Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంపెడు టమాటల కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. 20 మంది మృతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. కఠినమైన ఆంక్షలు

ఏదైనా ఘర్షణకు దిగుతుంటే అది మన జీవితానికో, ఆర్థికంగానో ఉపయోగపడేలా ఉండాలి. అందులో బంగారం కోసమో.. వజ్రాల కోసమో ఘర్షణ పడ్డామంటే ఓ లెక్క ఉంటుంది. అలాగే కొందరు ముఖ్యమైన..

గంపెడు టమాటల కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. 20 మంది మృతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. కఠినమైన ఆంక్షలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 11, 2021 | 1:04 PM

ఏదైనా ఘర్షణకు దిగుతుంటే అది మన జీవితానికో, ఆర్థికంగానో ఉపయోగపడేలా ఉండాలి. అందులో బంగారం కోసమో.. వజ్రాల కోసమో ఘర్షణ పడ్డామంటే ఓ లెక్క ఉంటుంది. అలాగే కొందరు ముఖ్యమైన దాని గురించి ఘర్షణలకు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. దీని గురించి ఎవరు విన్నా.. ఆశ్చర్యపోతారు. గంపెడు టమాటల కోసం రెండు గ్రూపులుగా విడిపోయి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. ఇది నిజమేనా..? అని వినడానికి ఆశ్యర్యంగా ఉండవచ్చు. కానీ మీరు చదువుతున్నది నిజమే. కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు.

ఆఫ్రీకా దేశమైన నైజీరియాలో టమాట బుట్ట కారణంగా ఘర్షణ చెలరేగింది. దేశం ఉత్తరం, దక్షిణ అని రెండు విడిపోయింది. అయితే గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి అంతటా పడిపోయాయి. ఇది సమీపంలోని దుకాణదారులు, పోర్టర్‌లతో వాదనకు దారి తీసింది. ఆ వాగ్వివాదం కాస్తా ఘర్షణకు దారితీసి పెద్ద పోరాటంగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన వార్తను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత మరింత పెరిగింది. దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణ క్రైస్తవులు విడిపోయారు. ఈ ఉద్రిక్తత జరిగిన నాలుగు గంటల తర్వాత హింసాత్మకంగా మారింది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో మాంసం అందుబాటులో లేకుండా పోయింది. టమాటలతో పాటు మిగతా కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఇలా తమాటల కారణంగా ఇంత మంది మృతి చెందడం సంచలనంగా మారింది.

ఇవి చదవండి :

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?