కెనడా వీధుల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వెలసిన బిల్ బోర్డులు, ఎందుకంటే ?

కెనడాలోని గ్రేటర్ టొరంటో నగర వీధుల్లో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన భారీ బిల్ బోర్డులు వెలిశాయి. తమ దేశానికి కోవిడ్ 19 వ్యాక్సిన్లు అందజేసినందుకు మోదీకి, ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ...

కెనడా వీధుల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వెలసిన బిల్ బోర్డులు, ఎందుకంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2021 | 12:31 PM

కెనడాలోని గ్రేటర్ టొరంటో నగర వీధుల్లో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన భారీ బిల్ బోర్డులు వెలిశాయి. తమ దేశానికి కోవిడ్ 19 వ్యాక్సిన్లు అందజేసినందుకు మోదీకి, ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బోర్డులు  ఏర్పాటు చేశారు. ‘లాంగ్ లివ్ కెనడా-ఇండియా ఫ్రెండ్ షిప్’ అని కూడా వీటిలో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో ప్రపంచంలో పలు దేశాలకు ఇండియా ఆపన్న హస్తమైంది. ఆయా దేశాలతో బాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ కరోనా పాండమిక్ సమయంలో చాలా దేశాలకు, ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు మీరు వ్యాక్సిన్లను పంపిణీ చేయడం గొప్ప విషయమని ఈ సంస్థ హెడ్ టెడ్రోస్ ..మోదీని, ఇండియాను కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.గతవారం  ఇండియా కెనడాకు 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపింది.ఇప్పటివరకు సుమారు 50 దేశాలకు తాము టీకామందులు పంపినట్టు మోదీ ఆ మధ్య ఇండియా-స్వీడన్ వర్చ్యువల్ మీట్ లో తెలిపారు. రానున్న నెలల్లో మరిన్ని దేశాలకు సప్లయ్ చేస్తామన్నారు.

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ సైతం ఇండియాను ఆకాశానికెత్తేశారు. కోవిడ్ పై పోరులోను, వ్యాక్సిన్ ఉత్పాదకతలోను భారత్ కృషి అమోఘమని ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇన్ని దేశాలకు ఇండియా నుంచి వ్యాక్సిన్ వెళ్లడం గ్రేట్ అని ఆయన అభివర్ణించారు.అటు తాము దాదాపు 150 దేశాలకు మెడిసిన్స్, ఇతర అవసరాలను కూడా పంపనున్నామని మోదీ పేర్కొన్నారు. ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్లతో తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఆయా దేశాల అవసరాలను తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు. దూర దేశాలకే కాదు… పొరుగునున్న బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలకు కూడా ఇండియా వ్యాక్సిన్ సప్లయ్ చేస్తోంది. ఇటీవలే పాకిస్థాన్ కూడా ఓ అంతర్జాతీయ ఒప్పందం కింద ఇండియా నుంచి టీకామందులను దిగుమతి చేసుకుంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

కేజీఎఫ్ స్టార్ యష్ మెడ చుట్టూ 80 ఎకరాల కంచె..!యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం..:Video

సచిన్ టెండూల్కర్ ప్రాంక్.. హడలిపోయిన డాక్టర్.. వైరల్ గా మారిన వీడియో : Sachin Tendulkar Pranks On Doctor Video.

1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, మంట రేపుతున్న వంటగది రేట్లు : Ginger and Egg High Prices Video

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త..ఇండియాలో భారీగా తగ్గిన ఆపిల్ ఫోన్ ధరలు..!:Iphone Price In India Video

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??