టీవీ లైవ్ లో స్టూడియో సెట్ కూలి ప్రెజెంటర్ కు స్వల్ప గాయాలు, చర్చా గోష్ఠికి బ్రేక్

కొలంబియాలోమీ ఈఎస్ పీఎన్  బ్రాడ్కాస్ట్  స్థూడియోలో ఓ విచిత్రం జరిగింది. లైవ్ గా ఓ చర్చా గోష్టి జరుగుతుండగా హఠాత్తుగా స్థూడియో సెట్ ఒకటి ప్రజెంటర్ కార్లోస్  ఆర్డెజ్ పై పడింది.

టీవీ లైవ్ లో స్టూడియో సెట్ కూలి ప్రెజెంటర్ కు స్వల్ప గాయాలు, చర్చా గోష్ఠికి బ్రేక్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2021 | 12:26 PM

కొలంబియాలోమీ ఈఎస్ పీఎన్  బ్రాడ్కాస్ట్  స్టూడియోలో ఓ విచిత్రం జరిగింది. లైవ్ గా ఓ చర్చా గోష్టి జరుగుతుండగా హఠాత్తుగా స్టూడియో సెట్ ఒకటి ప్రజెంటర్ కార్లోస్  ఆర్డెజ్ పై పడింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఫుట్ బాల్  మ్యాచ్ పై జరిగిన ఈ గోష్టిలో పాల్గొన్న ఆయన అనుకోని ఈ పరిణామానికి ఖంగు తిన్నారు. ఆ సెట్ ఆయనపై పడుతున్న దృశ్యం చూసి కామెంటేటర్లు అంతా  షాక్ తిని మాటరాకుండా ఉండిపోయారు. కార్యక్రమం నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అయింది. కాగా కార్లోస్ ఆర్డేజ్ ఆరోగ్య పరిస్థితిపై అనేకమంది నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏం కాలేదు కదా అని వారు ఆరా తీశారు.

అయితే అదృష్టవశాత్తూ తనకేమీ కాలేదని, మెడికల్ చెకప్ చేయించుకున్నానని, ముక్కుకు మాత్రం స్పల్ప గాయమైందని కార్లోస్  ఆ తరువాత ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  బొగొటా నగరంలో నిన్న జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. టీవీ లేదా రేడియో స్టేషన్ లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అత్యంత భద్రత తీసుకోవాల్సి ఉంటుందని, స్టూడియో ఎంత నాసిరకంగా నిర్మించారన్నది ఈ సంఘటనతో నిరూపితమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా కొన్ని దేశాల్లో ఇలా లైవ్ కార్యక్రమాలు జరుగుతుండగా ఈ విధమైన ఘటనలు జరిగాయని వారు  పేర్కొంటున్నారు.  ఈఎస్ పీఎన్  ఘటన చూసైనా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

సచిన్ టెండూల్కర్ ప్రాంక్.. హడలిపోయిన డాక్టర్.. వైరల్ గా మారిన వీడియో : Sachin Tendulkar Pranks On Doctor Video.

1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, మంట రేపుతున్న వంటగది రేట్లు : Ginger and Egg High Prices Video

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త..ఇండియాలో భారీగా తగ్గిన ఆపిల్ ఫోన్ ధరలు..!:Iphone Price In India Video

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ