AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?

H-1B Vias: 2021 అక్టోబర్‌1 నుంచి 2022 సెప్టెంబర్‌ 30 వరకు హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనే మార్చి 10 నుంచి ప్రారంభమైంది. 2021-22..

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?
Subhash Goud
|

Updated on: Mar 10, 2021 | 7:05 PM

Share

H-1B Vias: 2021 అక్టోబర్‌1 నుంచి 2022 సెప్టెంబర్‌ 30 వరకు హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనే మార్చి 10 నుంచి ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్‌-1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగుతుంని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్‌-1బీ వీసాల అందజేస్తామని, కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని తెలిపింది. ఏప్రిల్‌ 1న నుంచి దరఖాస్తులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.

అయితే దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మాత్రమే హెచ్‌-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందిచాలి. ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్‌-1బీ కయాప్‌ సబ్జెక్ట్‌ పిటిషన్లకు దాఖలు చేయడానికి అర్హులు. హెచ్‌-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది 85,000 కొత్త హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తుంది. దీంతో భారతీయులకు, ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే హెచ్‌-1బీ వీసాలు పొందిన వారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరవచ్చు. ప్రతి సంవత్సరం విదేశీయులకు 65 వేల హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20 వేల హెచ్‌-బీ వీసాలు మాస్టర్‌ క్యాప్‌ కిందకు వస్తోంది. ఈ సంవత్సరం యూఎస్‌సీఐఎస్‌కు సుమారు 2.67 లక్షల రిజిస్ట్రేషన్‌లు అందాయి. ఇందులో 60 శాతానికి పైగా భారత్‌కు చెందిన వారే. ఈ ఏడాది కూడా దాదాపు 60 వేల వీసాలు భారతీయులకు తక్కే అవకాశం ఉందని అంచనా.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా..

1. ముందుగా ప్రతి దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్‌-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 2. ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 10 డాలర్లు (రూ.72) చెల్లించాలి. 3. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అవసరం ఉంటుంది.. 4. ఎంపికైన దరఖాస్తుదారుడు మాత్రమే హెచ్‌-1బీ క్యాప్‌-సబ్జెక్ట్‌పిటిషన్లను దాఖలు చేసుకోవడానికి అర్హులు.

ఇవి చదవండి :

Prime Minister of Pakistan: సోషల్ మీడియాలో వీడియో.. మరింత దిగజారుతున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్ఠ..

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Follow Us
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?