ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..

సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. కన్నకొడుకులు సరిగ్గా చూడటం లేదని, సరైన తండి పెట్టకుండా బయటకు గెంటేస్తున్నారని తల్లిదండ్రులు కొడుకులపైన ఫిర్యాదు..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..
Follow us

|

Updated on: Mar 11, 2021 | 7:23 AM

సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. కన్నకొడుకులు సరిగ్గా చూడటం లేదని, సరైన తిండి పెట్టకుండా బయటకు గెంటేస్తున్నారని తల్లిదండ్రులు కొడుకులపైన ఫిర్యాదు చేసినవాళ్లము చూసే ఉంటారు. కానీ ఇక్కడ మాత్ర కనిపెంచిన తల్లిదండ్రులపైనే కొడుకు కేసు పెట్టడం ఆశ్యర్యం కలిగిస్తోంది. అవకాశం వస్తే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపైనే బతికేవాళ్లు ప్రపంచంలో చాలా మందే ఉన్నారని  ఈ ఘటనను చూస్తే అర్థమైపోతోంది. ఓ కొడుకు అమ్మనాన్నలపైనే కేసు పెట్టాడు. కొడుకు ఏదో ఆనారోగ్యం, శరీర అవయవాలు సరిగ్గా పని చేయడం లేదేమో, ఇంకేవనా కారణాలు అని అనుకుంటే పొరపాటే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ పొందిన ఆ వ్యక్తి తల్లిదండ్రులపైనే భారం మోపుతూ కేసు పెట్టాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ల దుబాయ్‌కి చెందిన ఫయాజ్‌ సిద్ధిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపైనే విచిత్రమైన దావా వేశాడు. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకు ఆర్థిక సాయం చేయాలంటూ కుమారుడు కొర్టుకెక్కడం సంచలనంగా మారింది.

ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం మోపాలంటూ ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పుకొచ్చాడు సిద్ధిఖీ. తన తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే తన మానవ హక్కుల ఉల్లంఘనకు గురైనట్టేనని అంటున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్ధిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని చేశాడు. అయితే 2011 నుంచి ఆయన నిరుద్యోగిగా ఉన్నాడు. అంతేకాదు తనకు ఫస్ట్‌క్లాస్‌ రాకపోవడానికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీయే కారణమంటూ యూనివర్సిటీపైన కూడా మూడు సంవత్సరాల కిందట దావా వేసే ప్రయత్నం చేశాడు. అక్కడ టీచింగ్‌ బాగా లేదని, అది తన కెరీర్‌కు నష్టం వేసిందని సిద్ధిఖీ వాదించాడు కూడా.

తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..

లండన్‌లోని హైడ్‌ పార్క్‌లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే తన ప్లాట్‌లో తన కొడుకు 20 ఏళ్లుగా ఎటువంటి అద్దె లేకుండా ఉండేందుకు అవకాశం ఇస్తున్నామని సిద్ధిఖీ తల్లిదండ్రులు రక్షందా, జావేద్‌లు తెలిపారు. అంతేకాదు సిద్ధిఖీ తల్లిదండ్రులు, తన కొడుకు బిల్లు కట్టడమే కాకుండా ప్రతి వారం కొంత సొమ్మును ఇస్తున్నామని పేర్కొంటున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు తమ కొడుకు సిద్ధిఖీకి చేస్తున్న ఆర్థిక తోడ్పాటులో కోత విధించాలని వారు భావిస్తుండటంతో కుమారుడే తల్లిదండ్రులపై కేసు పెట్టేశాడు. అయితే తన తల్లిదండ్రుల నుంచి జీవితకాలం ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడినని ఆయన వాదిస్తున్నాడు. ఇక సిద్ధిఖీ దాఖలు చేసిన పిటిషన్‌ను గత ఏడాది ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు అది ఎగువ కోర్టులో విచారణకు వచ్చింది.

ఇవి చదవండి:

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?

Photo Gallery: 17 ఏళ్లుగా భార్య శవం పక్కనే.. ఆమె ఎముకలు కుళ్లిపోకుండా వినూత్న ఆలోచన

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ