Turkey Floods: ఐదు ప్రావిన్స్‌లను తీవ్రంగా దెబ్బ తీసిన వరదలు.. నేలమట్టమైన భవనాలు!
Turkey Floods: బ్లాక్‌సీ ఫ్లడ్స్ టర్కీని కుదిపేశాయి. ఐదు ప్రావిన్స్‌లను తీవ్రంగా దెబ్బ తీశాయి. వరదల్లో పలు వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి.. ఇద్దరు గల్లంతైపోయారు. ఉత్తర టర్కీని..
Turkey Floods: బ్లాక్‌సీ ఫ్లడ్స్ టర్కీని కుదిపేశాయి. ఐదు ప్రావిన్స్‌లను తీవ్రంగా దెబ్బ తీశాయి. వరదల్లో పలు వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి.. ఇద్దరు గల్లంతైపోయారు. ఉత్తర టర్కీని భారీ వర్షాలు, వరదలు వణికించాయి. నల్ల సముద్రం తీరంలోని కాస్టమోను, బార్టిన్, సినోప్, జోంగుల్డాక్, బార్టిన్ ప్రావిన్స్‌లలోని పలు జిల్లాలను ఈ వరదలు దారుణంగా దెబ్బతీశాయి. కొండచరియలు కూడా విరిగిపడటంతో పరిస్థితి మరింత బీభత్సంగా మారింది. కుండపోత వర్షాల కారణంగా ఇనేబోలు నది ప్రవాహం పోటెత్తింది. నదీ ప్రవాహ మార్గంలోని బోజ్‌కుర్ట్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట ముగిగాయి. తీరం వెంట గోడలు, భవనాలు దెబ్బతిన్నాయి. ఇనెబోలు ప్రవాహం ఉధృతికి పలు వంతెనలు కూడా ధ్వంసమై కొట్టుకుపోయాయి. కాస్టమోను ప్రావిన్స్‌లోని పలు రహదారులు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కుండపోత వర్షాలు, వరదల కారణంగా ఉత్తర టర్కీలోని చాలా ప్రాంతాల్లో వీధులు కాలువలను తలపించాయి. వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు తేలుతూ కనిపించాయి. పలు నివాసాల బేస్‌మెంట్లు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం మొదటి అంతస్తుల వరకూ రావడంతో చాలా మంది భవనాలపైనే అశ్రయం పొందారు. సహాయక సిబ్బంది వీరిని రక్షించారు. పార్కులు, మార్కెట్లు కూడా నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు అప్రమత్తం చేశారు. వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా నిలిచిపోయింది. వరదల కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకున్నా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి