Colombia: జైలులో తొక్కిసలాట.. 49 మంది ఖైదీలు మృతి.. కారణమేంటంటే
కొలంబియాలో(Colombia) తీవ్ర విషాదం నెలకొంది. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో హింసాత్మక తోపులాట జరిగింది. ఈ ఘటనలో 49 మంది ఖైదీలు మృతి చెందారు. తులువా నగరంలోని జైలులో ఖైదీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో..
కొలంబియాలో(Colombia) తీవ్ర విషాదం నెలకొంది. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో హింసాత్మక తోపులాట జరిగింది. ఈ ఘటనలో 49 మంది ఖైదీలు మృతి చెందారు. తులువా నగరంలోని జైలులో ఖైదీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో కొందరు పరుపులకు నిప్పంటించారు. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. తీవ్ర భయాందోళనకు గురైన ఖైదీలు.. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు తీశారు. పరిస్థితి అదుపుతప్పి తీవ్ర తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 49 మంది మృతి చెందారు. మరో నలభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ దుక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విధానం దర్యాప్తు జరిపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాగా.. అమెరికా దేశాల్లోని జైళ్లలో ఇటువంటి ఘటనలు సాధారణమయ్యాయి. ఈక్వెడార్‌లో గతేడాదిలో ఆరుసార్లు అల్లర్లు జరిగాయి. ఆ ఘటనల్లో తీవ్ర స్థాయిలో ఖైదీలు ప్రాణాలు విడిచారు. కొలంబియాలో జైళ్లు ఖైదీలతోకిక్కిరిసిపోయాయి. అక్కడి జైళ్ల సామర్థ్యం 81వేలు కాగా ప్రస్తుతం దాదాపు 97వేల మంది ఖైదీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..