Maharashtra: రండి.. కూర్చుని మాట్లాడుకుందాం.. రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి

మహారాష్ట్రలో(Maharashtra) నెలకొన్న రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం వ్యతిరేకత ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనుక్షణం ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ క్రమంలో...

Maharashtra: రండి.. కూర్చుని మాట్లాడుకుందాం.. రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి
Uddav
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 28, 2022 | 5:41 PM

మహారాష్ట్రలో(Maharashtra) నెలకొన్న రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం వ్యతిరేకత ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనుక్షణం ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలకు శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక విజ్ఞప్తి చేశారు. గౌహతిలోని ఓ హోటల్ లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలందరూ ముంబయి తిరగి వచ్చి.. తనతో మాట్లాడాలని పిలుపునిచ్చారు. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ మేరకు వారికి ఓ లేఖ రాశారు. మీరంతా మాతో టచ్‌లో ఉన్నారన్న ఉద్ధవ్ (Uddav Thackerey).. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని విజ్ఞప్తి చేశారు. సమయం ఇంకా మించిపోలేదని. తనతో కూర్చుని మాట్లాడాలని కోరారు. ఎవరి మాటలకూ లొంగిపోవద్దని, శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదని పేర్కొన్నారు.

మరోవైపు.. గౌహతిలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది. ఉద్ధవ్‌థాక్రే సర్కార్‌కు మద్దతు ఉపసంహరణ, అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై షిండే వర్గం చర్చలు జరుపుతోంది. రెబల్‌ ఎమ్మెల్యేలతో చర్చల తరువాత హోటల్‌ బయటకు వచ్చారు షిండే. రాజకీయ సంక్షోభం తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు షిండే. తమదే అసలైన శివసేన అన్నారు షిండే. తమ వర్గం ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో లేరని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. బాల్‌థాక్రే హిందుత్వాన్ని తాము ముందుకుతీసుకెళ్తునట్టు తెలిపారు. 50 మంది ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్నారని తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. త్వరలోనే ముంబైకి వస్తానని స్పష్టం చేశారు షిండే.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హత నోటీసుకు సమాధానం ఇవ్వడానికి జూలై 12 వరకు సమయం ఇచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్షకు సంబంధించి ఏక్నాథ్ షిండే న్యాయవాదులను సంప్రదించారు. ఈ వారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన మెజారిటీని నిరూపించుకోవాలని కోరవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం