AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. రెండు వారాలపాటు పెట్రో విక్రయాలు బంద్..

శ్రీలంకలో రెండు వారాల పాటు ఇంధన విక్రయాలు నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం బస్సులు, రైళ్లు, ప్రభుత్వం వాహనాలు, అత్యవసర సర్వీసులకు మాత్రమే ఇంధనాన్ని అందిస్తారు.

Sri Lanka: ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. రెండు వారాలపాటు పెట్రో విక్రయాలు బంద్..
Sri Lanka
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2022 | 8:50 AM

Share

Sri Lanka economic crisis: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇంధన కొరత పెద్ద సమస్యగా మారింది. దేశంలో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం 9,000 టన్నుల డీజిల్‌, 6,000 టన్నుల పెట్రోల్‌ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో శ్రీలంకలో రెండు వారాల పాటు ఇంధన విక్రయాలు నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం బస్సులు, రైళ్లు, ప్రభుత్వం వాహనాలు, అత్యవసర సర్వీసులకు మాత్రమే ఇంధనాన్ని అందిస్తారు. ప్రయివేటు వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం శ్రీలంకలో అందుబాటులో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ వారం రోజుల్లో పూర్తిగా నిండుకోనుంది. అత్యవసరాలకు మాత్రమే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంక్షోభాన్ని నివారించే దిశగా శ్రీలంక అధికారులు రష్యా, ఖతార్‌ బయలు దేరారు. ఆ దేశాల నుంచి ఇంధనాన్ని కోనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. శ్రీలంకలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలను మూసేశారు.దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో రవాణా, ప్రయాణ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయాలను తెరవాలని నిర్ణయించింది.

శ్రీలంకకు వచ్చే ఆరు నెలల కాలంలో ఆహార, ఇంధనం, ఎరువుల కోసం ఐదు బిలియన్‌ డాలర్లు అవసరమని ఆ దేశ ప్రధానమంత్రి రణిల్‌ విక్రమ సింఘే తెలిపారు. ఇందు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సాయం కోరుతున్నారు.. గత వారం కొలంబోను సందర్శించిన ఐఎంఎఫ్‌ బృందం లంక అధికారులతో 3 బిలియన్‌ డాలర్ల బెయిలౌట్‌ డీల్‌పై చర్చించింది. మరోవైపు నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు ఏర్పడటంతో భారత్‌, చైనాల సాయాన్ని కోరింది శ్రీలంక..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..