AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తండ్రి కలలో కనిపించి చెప్పాడని.. తాంత్రిక శక్తుల కోసం లాలాజలం తాగడానికి 42 మంది మహిళలను హత్య చేసిన కిల్లర్..

1997 సంవత్సరంలో 21 ఏళ్ల మహిళ మృతదేహం పొలంలో శవమై కనిపించడంతో సుదార్జీ హత్యలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం సుదార్జీ వద్ద వదిలి వెళ్లిన మహిళ కనిపించకపోవడంతో చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Viral News: తండ్రి కలలో కనిపించి చెప్పాడని.. తాంత్రిక శక్తుల కోసం లాలాజలం తాగడానికి 42 మంది మహిళలను హత్య చేసిన కిల్లర్..
Indonesian Man
Surya Kala
|

Updated on: Jul 12, 2022 | 11:26 AM

Share

Viral News: నేటి కాలంలో.. శాస్త్ర, సాంకేతిక రంగంలో అభివృద్ధితో చంద్రుడిపై కూడా అడుగు పెడుతున్నాడు. అయినప్పటికి ప్రపంచంలో చాలా మంది మూఢనమ్మకాలను విశ్వసించే వారున్నారు. తమ విజయం కోసం కొంతమంది వ్యక్తులు మూఢనమ్మకాలను పాటిస్తూ.. ఎంతటి దారుణానికైనా పాల్పడతారు. ఎవరినీ చంపడానికి వెనుకాడరు. చాలా మంది సీరియల్ కిల్లర్లు ఉన్నారు. వీరి గురించి ప్రజలకు తెలిస్తే..  ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి  విచిత్రమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఓ వ్యక్తి 42 మంది మహిళలను తప్పుదోవ పట్టించి హత్య చేశాడు.

ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం.. ఈ కేసు ఇండోనేషియాకు చెందింది. 42 ఏళ్ల సీరియల్ కిల్లర్ పేరు అహ్మద్ సుదార్జీ . ఇతను తన మాయమాటలతో యువతులను ఆకట్టుకునేవాడు. తన మూఢనమ్మకాలతో ఆ యువతులను హత్య చేశాడు. 14 ఏళ్ల క్రితం అంటే 2008లో ఈ హత్యలకు మరణశిక్ష విధించినప్పుడు.. అతను తన నేరాన్ని అంగీకరించాడు. తాను 42 మంది మహిళలను, బాలికలను  హత్యలు చేసినట్లు కోర్టులో తెలిపారు. ఇందులో 11 మంది మైనర్ బాలికలు కూడా ఉన్నారు.

హత్య చేయడానికి గల కారణం: 

ఇవి కూడా చదవండి

సురద్జీని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో చెప్పిన సమాధానం విని షాక్ తిన్నారు పోలీసులు. ఒక రోజు తన కలలో తన తండ్రి ఆత్మ కనిపించిందని..  70 మంది మహిళల లాలాజలం తాగితే..  తాను మంచి తాంత్రికుని కాగలనని తన తండ్రి చెప్పినట్లు సుదర్జీ చెప్పాడు. తండ్రి ఆత్మ చెప్పిన మాటను విని.. సురద్జీ హత్యలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. స్త్రీ లాలాజలం తాగడానికి .. తాను గొప్ప తాంత్రికుడిగా మారడానికి చాలా సమయం పడుతుందని సుదర్జీ భావించాడు. అప్పటి నుంచి స్త్రీలను చంపి వారి లాలాజలం తాగడం మొదలుపెట్టాడు.

ఇందుకు తన దగ్గరకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం వచ్చే మహిళలను ఎంచుకున్నాడు సుదర్జీ. తన దగ్గరకు వచ్చే మహిళలకు మెరుగైన జీవితం కోసం యాగం చేయాలని భావిస్తున్నారని విచారణ సందర్భంగా సుదర్జీ చెప్పాడు. తన దగ్గరకు వచ్చిన మహిళలను చెరుకుతోటకు తీసుకెళ్లి నడుము వరకు పూడ్చిపెట్టేవాడినని.. ఇది ఆచారంలో భాగమని, అందుకే భయాందోళన చెందవద్దని, మహిళలు నిలదొక్కుకోగానే గొంతు నులిమి హత్య చేసినల్టు విచారణలో చెప్పాడు. అనంతరం వారి లాలాజలం తాగేవాడినని తెలిపాడు సురద్జీ.

మీడియా కథనాల ప్రకారం 1997 సంవత్సరంలో 21 ఏళ్ల మహిళ మృతదేహం పొలంలో శవమై కనిపించడంతో సుదార్జీ హత్యలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం సుదార్జీ వద్ద వదిలి వెళ్లిన మహిళ కనిపించకపోవడంతో చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సురద్జీ మొదట్లో  పోలీసులు విచారణకు సహకరించలేదు. దీంతో అధికారులు కాస్త కఠినత పెంచే సరికి చిలుక పలుకులు పలికినల్టు హత్యలు చేసిన సంగతి.. ఎలా ఎప్పుడు హత్య చేశాడో అన్ని చెప్పాడు. (Source)

ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి .