ఏం కళ్లు రా బాబు..! చూస్తూనే ఉండిపోవచ్చు..!! అనుపమ మెరుపులు
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సినిమాల స్పీడ్ తగ్గించిందా.? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రేమమ్ సినిమాతో టీనేజ్ లోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ వయ్యారి..

Anupama
- మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సినిమాల స్పీడ్ తగ్గించిందా.? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
- ప్రేమమ్ సినిమాతో టీనేజ్ లోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. అఆ, శతమానం భవతి సినిమాలతో తెలుగు సినీరంగంలోఅడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.
- ఇప్పుడు తెలుగు, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ వయ్యారి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవలే డ్రాగెన్, పరదా, కిష్కింధపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి చిత్రాలతో అలరించింది..
- చివరిగా తమిళ్ లో బైసన్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ బైసన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
- సింపుల్ డ్రెస్ లో ఉంగరాల జుట్టుతో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. కంటెంట్ ప్రాధాన్యత చూస్తూ.. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ కేరళ కుట్టి. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.





