Dhurandhar 2: ‘ధురంధర్ 2’ లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
మార్చిలో విడుదల కానున్న 'ధురంధర్ 2' ఈ ఏడాది ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. 'ధురంధర్' పెద్ద హిట్ కావడంతో, 'ధురంధర్ 2' చిత్రాన్ని మరింత పెద్ద ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది.

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావస్తున్నా, ‘ధురంధర్’ ఇప్పటికీ చాలా చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. ఇక మార్చిలో విడుదల కానున్న ఈ సినిమా రెండవ భాగం ‘ధురంధర్ 2’ భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ‘ధురంధర్’ పెద్ద హిట్ కావడంతో, ‘ధురంధర్ 2’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ లో మరో స్టార్ నటుడు కూడా చేరనున్నట్లు చెబుతున్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ ‘ధురంధర్’ మూవీని తెరకెక్కించాడు. ఉరిలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీతో విక్కీ కౌశల్ రేంజ్ మారిపోయింది. తాను ప్రేమ, నిజ జీవిత కథలకు మాత్రమే కాకుండా యాక్షన్ చిత్రాలకు కూడా తగిన నటుడని ‘ఉరి’ ద్వారా విక్కీ కౌశల్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆదిత్య ధర్ తన మొదటి సినిమా కథను ‘ధురంధర్ 2’ చిత్రానికి లింక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం విక్కీ కౌశల్ ‘ధురంధర్ 2’ సినిమాలో నటించనున్నాడు. నిజానికి, ‘ధురంధర్’ హీరో జస్కిరత్ సింగ్ రంగి (సినిమాలో రణవీర్ సింగ్ అసలు పేరు) ‘ఉరి’ సినిమాలో ప్రస్తావించారు. ‘ఉరి’ సినిమాలో, హీరో ఒక మహిళా ఆర్మీ ఆఫీసర్‌తో మాట్లాడినప్పుడు, ఆమె, ‘జస్కిరత్ సింగ్ రంగి నా భర్త, అతను నౌషేరాలో జరిగిన ఆపరేషన్‌లో అమరవీరుడు’ అని చెబుతుంది. అదేవిధంగా, ‘ఉరి’ హీరో విహాన్ షెర్గిల్ (విక్కీ కౌశల్ పాత్ర పేరు) కూడా ‘ధురంధర్ 2′ సినిమాలో ఎంట్రీ ఇస్తాడు. కానీ ఇది కేవలం అతిథి పాత్ర మాత్రమేనని చెబుతున్నారు.
ధురంధర్’ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో పాటు విలన్ అక్షయ్ కుమార్ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. దీంతో ‘ధురంధర్ 2’ సినిమాలో కూడా ఆయన తన పాత్రను కొనసాగిస్తారని చెబుతున్నారు. ‘ధురంధర్’ సినిమాలో ఆ పాత్ర చనిపోయినప్పటికీ, అక్షయ్ పాత్రను ఫ్లాష్‌బ్యాక్‌లలో తిరిగి తీసుకువస్తారు. ఇప్పుడు, విక్కీ కౌశల్ పాత్రను కూడా దీనికి జోడిస్తే, ప్రేక్షకులకు అది డబుల్ బ్లాస్ట్ అవుతుంది. ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కానుంది.
జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్
Just imagine the numbers that #Dhurandhar will be getting once it releases on OTT…🫡
BOTH will watch…the ones who have seen it in theatres …and…also who haven’t yet experienced this saga…😄
DHURANDHAR on #Netflix from 30th January…👏💪🎬#RanveerSingh #AdityaDhar pic.twitter.com/VYTGDYNyNG
— CHANGU MANGU TALKS (@changuxmangu) January 21, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




