US Drone Strike: టెర్రరిస్టులపై అమెరికా డ్రోన్ స్ట్రైక్.. ఐఎస్ఐఎస్ సిరియా చీఫ్ హతం..
Islamic State Syria Chief: అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ సిరియా చీఫ్ చనిపోయాడు. ఈ వివరాలను పెంటగాన్ వెల్లడించింది. US మీడియా ప్రకారం, మంగళవారం ఉదయం US వైమానిక దాడిలో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ అగ్ర నాయకుడు..

టెర్రరిస్టులపై మరోసారి అగ్రదేశం అమెరికా నిప్పులు కురిపించింది. అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ సిరియా చీఫ్ చనిపోయాడు. ఈ వివరాలను పెంటగాన్ వెల్లడించింది. US మీడియా ప్రకారం, మంగళవారం ఉదయం US వైమానిక దాడిలో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ అగ్ర నాయకుడు మహర్ అల్-అగల్ మరణించాడు. సిరియాలోని జిందారిస్ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా మహర్ అల్-అగల్ చనిపోయాడని.. అతని ముఖ్య సహాయకులలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పెంటగాన్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి AFPకి తెలిపారు.
US సెంట్రల్ కమాండ్ సెంట్‌కామ్ ప్రతినిధి ప్రకారం, మహర్ అల్-అగల్ ISIS మొదటి నలుగురు నాయకులలో ఒకడు. ప్రకటన ప్రకారం, అల్-అగ్ల్ డిప్యూటీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు, అయితే అతను చంపబడ్డాడా లేదా గాయపడ్డాడా అనేది స్పష్టంగా తెలియలేదు.
డ్రోన్ దాడిలో అగల్ చనిపోయాడని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా ధృవీకరించాయి. అలెప్పో వెలుపల మోటార్‌సైకిల్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారని, మరొకరు గాయపడ్డారని సిరియన్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది, అయితే బాధితులను గుర్తించలేదు.
ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-ఖుర్షీ హతమైన ఉత్తర సిరియా నగరం అటామ్‌పై US దాడి చేసిన ఐదు నెలల తర్వాత ఈ దాడి జరిగింది. ఖురేషీ పట్టుబడకుండా ఉండేందుకు బాంబు పేల్చడంతో మరణించాడని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్యప్రాచ్య పర్యటనకు ముందు ఈ దాడి వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియాకు వెళ్లే ముందు ఆయన బుధవారం ఇజ్రాయెల్‌లో సమావేశం కానున్నారు.
