AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..! మీ రాశి ఉందా.?

Gajakesari Raja Yoga: జనవరి 23న ఉదయం 8.33 గంటలకు చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. నాల్గవ స్థానమైన కర్కాటకంలో బృహస్పతి సంచారం గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రభావవంతమైన యోగం కొన్ని రాశుల వారికి గౌరవం, జ్ఞానం, సంపద, ఆనందం, శ్రేయస్సు, కెరీర్ పురోగతిని పెంచుతుంది. రాజయోగంతో లాభం పొందుతున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Zodiac Signs: గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..! మీ రాశి ఉందా.?
Gajakesari Rajayoga
Rajashekher G
|

Updated on: Jan 23, 2026 | 8:19 AM

Share

వసంత పంచమి రోజున అంటే జనవరి 23న ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకొస్తోంది. జ్యోతిష్కుల ప్రకారం ఈ సంవత్సరం వసంత పంచమి రోజు గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. జనవరి 23న ఉదయం 8.33 గంటలకు చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. నాల్గవ స్థానమైన కర్కాటకంలో బృహస్పతి సంచారం గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా వసంత పంచమి రోజున ఈ రాజయోగం శక్తివంతంగా ఉంటుంది. ఈ ప్రభావవంతమైన యోగం కొన్ని రాశుల వారికి గౌరవం, జ్ఞానం, సంపద, ఆనందం, శ్రేయస్సు, కెరీర్ పురోగతిని పెంచుతుంది. ఈ రాశులవారికి సరస్వతీదేవి ఆశీర్వాదం కూడా సానుకూల ఫలితాలను అందజేస్తుంది. రాజయోగంతో లాభం పొందుతున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి

గజకేసరి యోగంతో వృషభ రాశి వారికి విజయవంతమైన కాలం అవుతుంది. మీ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. మీరు మీ కలను నెరవేర్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయం భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్‌లో కుటుంబం, స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కృషి ఇప్పుడు మీ కెరీర్, వ్యాపారంలో ఫలిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు చేపడతారు. ఈ సమయంలో భాగస్వామ్యాల నుంచి మరిన్ని లాభాలు పొందుతారు. మీ కెరీర్ పురోగతికి కొత్త మార్గాలు తెరచుకుంటాయి.

మిథున రాశి

మిథునరాశి వారికి ఇది సానుకూల మార్పుల సమయం అవుతుంది. మీరు పాత స్నేహితులు, బంధువులతో ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. మిథన రాశి వారు కొత్త ప్రాజెక్టులు, విద్య లేదా కరీర్ సంబంధిత నిర్ణయాలలో కూడా సానుకూల ఫలితాలను చూస్తారు. మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గుడపుతారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. మీ పెట్టిన పెట్టుబడులకు లాభాలను అందుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఆనందం రెట్టింపవుతుంది. ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశాంతంగా ఉంటారు.

కుంభ రాశి

గజకేసరి రాజయోగంతో కుంభరాశి వారి జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రావచ్చు. ఈ సమయంలో మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి గతంలో కంటే తక్కువగా ఉంటుంది. ఈ సమయం కొత్త ప్రారంభాలు, విజయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ప్రేమ, సామరస్యం బలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భాగస్వామ్యాలు లేదా వ్యాపార సంస్థలలో కూడా లాభాలు పొందుతారు. నిరంతరం విజయం సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాలు, వ్యాపారాలలో మీకు అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)