Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 23, 2026): మేష రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహ కాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (జనవరి 23, 2026): మేష రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని అదనపు బాధ్యతలు, అనవసర బాధ్యతలు తగ్గిపోతాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు, దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహకారంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీ పనితీరుతో అధికారులు, సహచరులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. కొందరు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబ విషయాల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ, తిప్పటలతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. లాభాలకు, రాబడికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబంలో అనుకో కుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా బాగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు ప్రోత్సాహక రంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యల మీద దృష్టి పెడతారు. రావలసిన డబ్బు చేతికి అంది కొన్ని అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొద్ది మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంతో ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులతో కూడా బాధ్యతలు పంచుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూల పరి స్థితులుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వ్యక్తిగత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. బంధువుల నుంచి శుభవార్తలందుతాయి. ఆదాయం పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు.