Driving License: RTO ఆఫీస్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ మార్చుకోండిలా!
Change Driving License Address Online: మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్చడానికి ఇకపై RTO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, పరివాహన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే చిరునామాను సులభంగా మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలు, ధృవీకరణ పత్రాలతో సహా 40 ఏళ్లు పైబడిన వారికి వైద్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. పూర్తి ప్రక్రియను తెలుసుకుని మీ లైసెన్స్‌ను అప్‌డేట్ చేసుకోండి.

చాలా మంది జాబ్ కోసమనో, లేదా పిల్లల చదువుల కోసమనో ఇతర ప్రాంతాకు వలస వెళ్తుంటారు. కొన్ని సార్లు అక్కడే స్థిరపడిపోతారు. అయితే వారు తమ సొంతూరులో ఉన్నప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉంటారు. ప్రస్తుతం వాళ్ల డ్రైవింగ్ లైసెన్స్‌లో పాత అడ్రసే ఉంటుంది. దాన్ని ప్రస్తుత అడ్రస్ కు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలా మంది ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మీరు ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గరనుంచే మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.
రవాణా శాఖ సేవలను మరింది సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శాఖకు చెందిన కొన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించే అవకాశం కల్పించింది. కాబట్టి మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలంటే.. మీరు మీ ప్రస్తుత నివాసానికి సంబంధించిన రుజువును సమర్పించాలి. ఉదాహరణకు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, మీ పేరులోని యుటిలిటీ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ మొదలైనవి. వీటితో పాటు మీరు ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా అవసరం.
డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా?
- మీరు డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలనకుని.. మీ వయస్సు 40 ఏళ్లు దాటితే మీకు కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ అవసరం ఇందుకోసం మీరు ఫాం 1-ఎ అవసరం
- మీ డ్రైవింగ్ లైసెన్స్ అప్‌డేట్ చేసుకునేందుకు మొబైల్, లేదా డెస్క్‌టాప్‌లో parivahan.gov.in అనే కేంద్ర రవాణా శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- తర్వాత అందులో ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌ను క్లిక్ చేసి ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్’, పై క్లిక్ చేయాలి.. తర్వాత అక్కడ మీరు ఏపీ, ‘తెలంగాణ మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో ఆ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
- తర్వాత ‘అప్లై ఛేంజ్ ఆఫ్ అడ్రస్ అనే దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీ ప్రస్తుత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ‘గెట్ డీఎల్ డిటెయిల్స్ పై క్లిక్ చేయాలి
- అప్పుడు మీకు ‘ఛేంజ్ ఆఫ్ అడ్రస్’ అనే అప్షన్ కనిపిస్తుంది.. దాన్ని క్లిక్ చేసి మీరు ఉంటున్న అడ్రస్ ఫిల్ చేయాలి
- మీరు దరఖాస్తు సబ్‌మిట్ చేసిన తర్వాత మీకు ఛార్జెస్ చూపిస్తుంది.. అక్కడ చూపించిన ఛార్జెస్‌ను మీరు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
- తర్వాత మీ సమీపంలోని ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు డేట్ బుక్ చేసుకోవాలి
- మీకు ఇచ్చిన డేట్‌రోజు ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి మీ ధరఖాస్తు ఒరిజినల్ పత్రాలను చూపిస్తే అధికారులు వాటిని చెక్ చేసి ఆమోదిస్తారు.
- తర్వాత మీకు కొత్త అడ్రస్‌తో కూడిన స్మార్ట్‌కార్డు లైసెన్సు ఇంటికే పోస్టు ద్వారా వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
