AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలోని మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న ధరలు..? వేసవిలోపే బ్యాడ్‌న్యూస్..

తెలంగాణలో బీర్ల ధరలు పెరగనున్నాయా.. బీరు ప్రియులకు ధర షాక్ తగలనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం బీర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీలకు నీటి సరఫరా నిలిచిపోవడమే. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన బేవరేజెస్ కంపెనీలకు నీటి సరఫరా బంద్ కానుంది.

Telangana: తెలంగాణలోని మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న ధరలు..? వేసవిలోపే బ్యాడ్‌న్యూస్..
Wine Shops
Venkatrao Lella
|

Updated on: Jan 23, 2026 | 10:18 AM

Share

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్. ఈ సారి వేసవిలో రాష్ట్రంలో బీర్ల కొరత విపరీతంగా ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు నీటి సమస్యనే కారణంగా తెలుస్తోంది. సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మత్తులు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. దీని వల్ల నీటి సరఫరా నిలిపివేసే అవకాశముంది. ఈ కారణంతో సంగారెడ్డి జిల్లాలోని నాలుగు బేవరేజెస్ కంపెనీలకు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నాలుగు ప్రధాన కంపెనీలు బీర్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కంపెనీల్లో బీర్ల తయారీకి నీళ్లు అందుతోంది. ఇప్పుడు నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల బీర్ల ఉత్పత్తి తగ్గపోతుందని, దీని వల్ల బీర్లకు కొరత ఏర్పడతుందని చెబుతున్నారు.

బీర్ల ఫ్యాక్టరీలకు 44 లక్షల లీటర్లు సరఫరా

ప్రస్తుతం బీర్ల కంపెనీలకు సింగూరు ప్రాజెక్ట్ ద్వారా రోజూ 44 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. ఈ బేవరేజెస్ కంపెనీ ద్వారా దాదాపు 11 రాష్ట్రాల్లకు బీర్ల సరఫరా అవుతుంది. ఇప్పుడు సింగూర్ జలమండలి నుంచి నీళ్లు ఆగిపోవడం వల్ల తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా బీర్ల సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల ఆ రాష్ట్రాల్లో కూడా బీర్ల కొరత వేసవిలో ఏర్పడనుంది. ఈ వేసవిలో ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి మరమ్మత్తులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్దమవుతున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తి కంపెనీలకు నీళ్లు బంద్ కావడం వల్ల కొరత ఏర్పడనుంది. దీంతో ఈ వేసవిలో చల్లని బీర్ తాగుతూ చీల్ అవ్వాలని కోరుకునే మందుబాబులకు షాక్ తగలనుందని చెప్పవచ్చు.

బీర్ల ధరలు పెరుగుతాయా..?

ప్రస్తుతం ఈ బేవరేజెస్ కంపెనీలకు తక్కువ ధరకే నీటిని సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ మరమ్మత్తుల తర్వాత నీటిని సరఫరా చేసేందుకు ఛార్జీలను పెంచే అవకాశముంది. ఇదే జరిగితే బీర్ల తయారీ కంపెనీలపై భారం పడనుంది. ఈ భారం తప్పించుకునేందుకు బీర్ల రేట్లను పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇక బీర్ల ఉత్పత్తి తగ్గితే ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లోని బేవరేజెస్ కంపెనీల నుంచి బీర్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు కానున్నాయి. ఈ కారణంతో కూడా వేసవిలో బీర్ల ధరలను పెంచే అవకాశముందని చెబుతున్నారు. ఇక నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల బీర్ల ఉత్పత్తి తగ్గి బేవరేజెస్ కంపెనీలకు ఆదాయం తగ్గనుంది. దీంతో బీర్ల తయారీ కంపెనీలు నష్టపోనున్నాయని చెబుతున్నారు. ఏదైనా రానున్న వేసవిలో బీరు ప్రియులకు షాక్ తప్పేలా కనిపించడం లేదు.

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో