Lady Boss Generosity: ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షల గిఫ్ట్…ఈ లేడీ బాస్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా..
మనం ఎన్నో రకాల బాస్‌లను చూస్తుంటాం. కొందరు తోటి ఉద్యోగులను రకరకాల కారణాలతో ఇబ్బంది పెడుతుంటారు.
మనం ఎన్నో రకాల బాస్‌లను చూస్తుంటాం. కొందరు తోటి ఉద్యోగులను రకరకాల కారణాలతో ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు సహచర ఉద్యోగులతో సామరస్యంగా మెలుగుతూ వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంటారు. ఇంకొందరు కొలీగ్స్‌ను తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు. అయితే వీరు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం మనం మాట్లాడబోయే బాస్ ఈ కోవకే చెందుతారు. తన వ్యాపార దక్షతతో సంస్థకు మంచి లాభాలను తీసుకొచ్చిన ఆమె… వాటిని సంస్థ ఉద్యోగులందరికీ సమానంగా పంచింది. ఇందులో భాగంగా ఒక్కో ఉద్యోగికి 10వేల డాలర్ల(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.7.5లక్షలు) చొప్పున మొత్తం 500 మందికి బహుమతిగా అందించింది. మొత్తం 500 మంది ఉద్యోగులకు… స్పాంక్స్ అనే ఓ సంస్థకు యజమానురాలిగా వ్యవహరిస్తున్నారు సారాబ్లేక్సీ. కొన్ని నెలల క్రితం ఆమె ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ నుంచి మెజారీటీ వాటాను కొనుగోలు చేశారు. అదృష్టవశాత్తూ ఈ డీల్ అనంతరం సారా కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే ఈ క్రెడిట్‌ను తానొక్కటే తీసుకోవాలని సారా భావించలేదు. వచ్చిన లాభాలను సంస్థ ఉద్యోగులందరికీ సమానంగా పంచాలనుకుంది. ఇందుకోసం తోటి ఉద్యోగుల కోసం గ్రాండ్‌గా పార్టీని ఏర్పాటుచేసింది. అందులో ఆమె మాట్లాడుతూ ‘ నేను మీ అందరితో ఒక సర్‌ప్రైజ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. సంస్థ లాభాల్లో మీకూ భాగం ఇవ్వాలనుకుంటున్నాను. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టికెట్లను బహుమతిగా అందిస్తున్నాను. టికెట్లు వద్దనుకున్న వారు డబ్బులు తీసుకోవచ్చు’ అని చెప్పుకొచ్చారు. సారా మాటలు విన్న తోటి ఉద్యోగులు తెగ సంబరపడిపోయారు. కొందరు ఉద్యోగులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ బాస్ మంచి మనస్సును మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Soooo…Spanx was valued at $1.2 billion in its recent deal, and Sara Blakely did something special to celebrate her team.
Absolute legend. pic.twitter.com/FN0HynYZTM
— Sahil Bloom (@SahilBloom) October 23, 2021
Also Read: