Japan Princess: ప్రేమ కోసం తన రాచరికాన్ని వదిలేసుకుంటున్న యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న జపాన్ ప్రిన్సెస్!

ప్రేమ కోసం త్యాగాలు సినిమాల్లో చాలా చూసి ఉంటాం. చాల సినిమాలలో యువరాణిని వివాహం చేసుకున్న సామాన్యుడిని చూశాం. కట్టుబాట్లు కాదని తానూ ఇష్టపడిన వాడితో ఏడడుగులు వేసినవారు ఎందరో ఉన్నారు.

Japan Princess: ప్రేమ కోసం తన రాచరికాన్ని వదిలేసుకుంటున్న యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న జపాన్ ప్రిన్సెస్!
Japan Princess Mako Marriage

Japan Princess:  ప్రేమ కోసం త్యాగాలు సినిమాల్లో చాలా చూసి ఉంటాం. చాలా సినిమాలలో యువరాణిని వివాహం చేసుకున్న సామాన్యుడిని చూశాం. కట్టుబాట్లు కాదని తానూ ఇష్టపడిన వాడితో ఏడడుగులు వేసినవారు ఎందరో ఉన్నారు. కానీ, జపాన్ యువరాణి చేస్తున్న సాహసం ముందు అన్నీ దిగదుడుపే! ఎందుకంటే.. ఆమె ఒక సామాన్యుడిని వివాహం చేసుకోబోతున్నారు. అందులో పెద్ద విశేషం ఏముందీ అనకండి. ఉంది. ఏమిటంటే.. జపాన్ ఆచారాల ప్రకారం అక్కడి రాచరిక వ్యవస్థలోని ఎవరైనా కట్టుబాట్లు మీరి వివాహం చేసుకుంటే వారి రాజ వంశం నుంచి బయటకు వెళ్లిపోవాలి. ప్రస్తుతం జపాన్ యువరాణి తన వివాహం కోసం ఆ త్యాగానికి సిద్ధం అయిపోయారు.

జపాన్ యువరాణి మాకో మంగళవారం సాధారణ యువకుడిని వివాహం చేసుకోనున్నారు. ఆమె ప్రియుడు కీ కొమురో జపనీస్ రాజవంశం వెలుపల ఒక సాధారణ పౌరుడు. దాదాపు నాలుగేళ్లుగా ఆమె తన కామన్ బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కారణంగా చాలా వివాదాలను ఎదుర్కొంది. ఈ కారణంగా, ప్రిన్సెస్ మాకో కూడా గత రెండేళ్లుగా డిప్రెషన్‌కు గురయ్యారు. తనపై ఉన్న ప్రేమ వల్లే ఇదంతా చేశానని మాకో చెప్పింది. ఆమె జీవితంలో ఆనందాన్ని కోరుకున్నారు. రాచరికపు పరదాల కంటే.. ప్రేమైక జీవితాన్నే ఆమె ఇష్టపడ్డారు.

జపాన్ రాజవంశం సంప్రదాయం ప్రకారం, రాజవంశం వెలుపల వివాహం చేసుకున్నందుకు యువరాణి లేదా యువరాజుకు కూడా సుమారు ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇస్తారు. కానీ మాకో..కొమురోల వివాహం చాలా వివాదానికి దారితీసింది, మాకో ఎటువంటి నష్టపరిహారాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. ఇది మాత్రమే కాదు, మాకో తన వివాహ కార్యక్రమాన్ని కూడా చాలా సింపుల్‌గా ఉంచాలని నిర్ణయించుకుంది. వేడుక తర్వాత, కొత్తగా పెళ్లయిన జంట టోక్యోలోని ఒక హోటల్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది.  వివాహం తర్వాత, మాకో, కొమురో న్యూయార్క్‌లో సాధారణ ప్రజలలా జీవించాలని నిర్ణయించుకున్నారు.

అక్కడి మీడియా వర్గాల సమాచారం ప్రకారం, వారిద్దరూ టోక్యో నుండి బయలుదేరుతారు. మాకో తల్లి ప్రిన్సెస్ కికో తన కూతురితో చాలా విషయాల్లో ఏకీభవించడం లేదని అంగీకరించింది. మాకో తండ్రి, ప్రిన్స్ అకిషినో, తన కుమార్తెను ఆశీర్వదించడానికే తాను వివాహానికి హాజరవుతానని చెప్పారు. మాకో ప్రస్తుతం జపాన్ రాజు నరుహిటో సోదరుడు ప్రిన్స్ అకిషినో కుమార్తె.

కొమురో తల్లి ఆర్థిక వివాదాలు, జపనీస్‌లో చెడిపోయిన ఇమేజ్

నిజానికి, కేయి కొమురో తల్లి, ప్రిన్స్ మాకో ప్రేమికుని తల్లిపై ఆర్థిక వివాదాల కారణంగా సాధారణ జపనీస్‌లో జంట ప్రతిష్ట దెబ్బతింది. జపనీయులు తమ దేశ రాజవంశాన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. ఈ కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా వివాదాలు ఉండకూడదని వారు అనుకుంటారు.

ఇవి కూడా చదవండి: Jio Phone Next: ప్రగతి ఓఎస్ తో జియోఫోన్ నెక్స్ట్.. జియో విడుదల చేసిన సరికొత్త ఫీచర్లు ఇవే!

IRCTC: మరింత కిందికి జారిపోయిన ఐఆర్సీటీసీ షేర్లు.. ఇప్పుడు అమ్మడం మంచిదా? కొనుగోలు మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?

NASA about Aliens: గ్రహాంతరజీవుల ఉనికి ఉండవచ్చు.. నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానం!

Click on your DTH Provider to Add TV9 Telugu