AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Locks Down Lanzhou: కరోనా డెల్టా వేరియంట్ కల్లోలం.. చైనాలో మరో నగరం లాక్ డౌన్ లోకి..

చైనా మరోసారి క్రమేపీ కరోనా కోరల్లోకి జారిపోతున్నట్టు కనిపిస్తోంది. పదిరోజులుగా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా చైనా నుంచి ఎటువంటి వార్తలూ బయటకు రావు. కానీ, కరోనాకు సంబంధించి తాజాగా మరో నగరాన్ని కూడా లాక్ డౌన్ చేశారు.

China Locks Down Lanzhou: కరోనా డెల్టా వేరియంట్ కల్లోలం.. చైనాలో మరో నగరం లాక్ డౌన్ లోకి..
China Coronavirus
KVD Varma
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 26, 2021 | 3:12 PM

Share

Coronavirus: చైనా మరోసారి క్రమేపీ కరోనా కోరల్లోకి జారిపోతున్నట్టు కనిపిస్తోంది. పదిరోజులుగా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా చైనా నుంచి ఎటువంటి వార్తలూ బయటకు రావు. కానీ, కరోనాకు సంబంధించి సోమవారం ఒక నగరంలో లాక్ డౌన్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో నగరాన్ని కూడా లాక్ డౌన్ చేశారు. వాయువ్య ప్రావిన్స్ గన్సుకు చెందినా ప్రావిన్షియల్ రాజధాని లాన్‌జౌలో ఆరు కేసులతో సహా 29 కొత్త దేశీయ ఇన్‌ఫెక్షన్లు బయటపడటంతో చైనా కఠిన నిర్ణయం తీసుకుంది. నాలుగు మిలియన్ల ప్రజలు ఉన్న ఆ నగరంలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. నివాసితులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటిని విడిచి బయటకు రావద్దని అక్కడి అధికారులు ప్రజలను హెచ్చరించారు. నివాసుల రాకపోకలను కచ్చితంగా నియంత్రిస్తామని వారు ప్రకటించారు. అంతేకాకుండా అవసరమైన సామాగ్రి లేదా వ్యద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు లాన్‌జౌలోని అధికారులు.

చైనాలోని అనేక ప్రాంతాల్లో, డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్‌ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. దీంతో చైనా వాయువ్య ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియాలోని ఐజిన్ కౌంటీలో సోమవారం పూర్తి లాక్ డౌన్ విధించారు. సోమవారం నుండి ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరింది. ఐజిన్ జనాభా 35,700. వారు కోవిడ్ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం, ఏజిన్ కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. గత వారం ఇక్కడ 150 మందికి పైగా కొత్త సోకినవారిని కనుగొన్నారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సుమారు ఒక వారంలో, కోవిడ్ సంక్రమణ 11 రాష్ట్రాలకు వ్యాపించిందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారనుంది. ఈ హెచ్చరిక తరువాత, ఏజిన్‌లో లాక్‌డౌన్ప్రకటించారు. చైనాలో సోమవారం 38 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో సగం ఇన్నర్ మంగోలియా నుండి వచ్చాయి.

బీజింగ్ లో ఆంక్షలు..

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో చైనా రాజధాని బీజింగ్ లో ఆంక్షలు తీవ్రతరం చేశారు. ఇప్పటికే బీజింగ్ లో కరోనా పాజిటివ్ కేసులు 12కి పెరిగాయి. దీంతో దేశంలోని కరోనా ఇన్ఫెక్షన్ కొనసాగుతున్న ప్రాంతాల్లో, అక్కడి ప్రజలు బీజింగ్‌కు రావాలంటే కొన్ని షరతులు పాటించాలని సూచించింది. కోవిడ్ పరీక్ష నివేదికను చూపించినప్పుడే వారికి రాజధానిలో ప్రవేశం లభిస్తుంది. ఈ నివేదిక 2 రోజుల కంటే పాతదిగా ఉండకూడదు. అలాగే, వారి ఆరోగ్యాన్ని 2 వారాల పాటు పర్యవేక్షిస్తారు. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ దృష్ట్యా, అధికారులు బీజింగ్‌లో దర్యాప్తును పెంచడం అదేవిధంగా హోటల్‌లో బుకింగ్‌ను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నారు.

బీజింగ్, ఇన్నర్ మంగోలియా, గాన్సు, నింగ్జియా మరియు గుయిజౌలలో కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలఉంది. ఈ రాష్ట్రాలలో దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రయాణాన్ని నిషేధించారు. దీనితో పాటు, రైళ్ల రాకపోకలను కూడా నిషేధించారు. పెరుగుతున్న సంక్రమణ దృష్ట్యా, పరిపాలన చాలా అప్రమత్తంగా ఉంది. వీలైనంత త్వరగా ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధించడమే ప్రభుత్వ ప్రయత్నం.

ఇవి కూడా చదవండి: Jio Phone Next: ప్రగతి ఓఎస్ తో జియోఫోన్ నెక్స్ట్.. జియో విడుదల చేసిన సరికొత్త ఫీచర్లు ఇవే!

IRCTC: మరింత కిందికి జారిపోయిన ఐఆర్సీటీసీ షేర్లు.. ఇప్పుడు అమ్మడం మంచిదా? కొనుగోలు మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?

NASA about Aliens: గ్రహాంతరజీవుల ఉనికి ఉండవచ్చు.. నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానం!